ఇక మీరు ఆపితే బాగుంటుంది.. ఆమీర్, రణ్‌‌బీర్, దీపికా, రణ్‌వీర్‌లకు వార్నింగ్..

అవును ఆమీర్ ఖాన్, రణ్ బీర్ కపూర్, దీపికా రణ్‌వీర్ సింగ్‌తో పాటు మరికొందరికి సెలబ్రిటీలకు  మీరు అవి ఆపితే బాగుంటుందని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: June 19, 2020, 7:52 AM IST
ఇక మీరు ఆపితే బాగుంటుంది.. ఆమీర్, రణ్‌‌బీర్, దీపికా, రణ్‌వీర్‌లకు వార్నింగ్..
ఆమీర్ ఖాన్,రణ్‌‌‌బీర్,రణ్‌వీర్ దీపికా (file/photos)
  • Share this:
అవును ఆమీర్ ఖాన్, రణ్ బీర్ కపూర్, దీపికా రణ్‌వీర్ సింగ్‌తో పాటు మరికొందరికి సెలబ్రిటీలకు  మీరు ఆ ప్రకటకల్లో నటించడం ఆపితే బాగుంటుందని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మన దేశానికి చైనాకు మధ్య సరిహద్దుల వద్ద  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు దేశ సేవలో ప్రాణాలు ఒదిలారు. దీంతో  దేశ వ్యాప్తంగా  చైనాపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కొందరు తమ దగ్గరున్న చైనా వస్తువులను పగలగొట్టి ఆ దేశంపై కసి తీర్చుకుంటున్నారు. అంతేకాదు బాయ్‌‌కాట్ చైనా ప్రొడక్ట్స్ అంటూ దేశ వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మన సినీ, క్రీడా ప్రముఖులు కొందరు చైనా ఉత్పత్తులకు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆయా నటులుపై మండిపడింది.

bollywood celebrities aamir khan ranbir kapoor ranveer singh deepika padukone should sto endorsing chinda brands,boycott china,boycott china china products,ciat,aamir khan, ranbir kapoor,ranveer singh,deepika padukone,virat kohli,ban china products,bollywood,tollywood,ఆమీర్ ఖాన్,దీపికా పదుకొణే,రణ్‌వీర్ సింగ్,రణ్‌‌బీర్ కపూర్,బ్యాన్ చైనా ప్రొడక్ట్స్,చైనా భారత్ సరిహద్దు,గాల్వన్ లోయ,భారత్ చైనా ఉద్రిక్తతలు
ప్రతీకాత్మక చిత్రం (Image;Twitter)


బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు అందరు చైనా ఉత్పత్తులను ఇప్పటికైనా ప్రచారం చేయడం మానుకోండి అంటూ డిమాండ్ చేసింది. లేకపోతే.. ప్రజలు మీ సినిమాలను, ఆటలను  బ్యాన్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చారు.ఇప్పటికే దీపికా, రణ్‌వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్, ఆమీర్ ఖాన్, క్రికెటర్ కోహ్లీ వంటి వారు చైనా కంపెనీలైన వీవో, ఓప్పో వంటి పలు ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న భావొద్వేగ పరిస్థితుల నేపథ్యంలో వీటికి ప్రచారం చేయోద్దంటూనే... వెంటనే ఆయా సెలబ్రిటీలు ఆయా కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని సీఏఐటీ డిమాండ్ చేస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 19, 2020, 7:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading