BOLLYWOOD BEAUTY SARA ALI KHAN TO ACT IN VIJAY DEVERAKONDA LIGER MOVIE MNJ
Vijaya Deverakonda- Liger Movie: విజయ్ దేవరకొండ 'లైగర్'లో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఫొటో షేర్ చేసిన ఛార్మీ
Vijay Devarakonda in liger Photo : Twitter
Vijay Deverakonda- Sara Ali Khan: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం లైగర్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
Vijay Deverakonda- Sara Ali Khan: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం లైగర్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఛార్మీ.. తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మీలతో పాటు సారా అలీ ఖాన్, కరణ్ జోహార్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఉన్నారు. ఆ ఫొటోకు ఛార్మీ.. ఆర్ట్ ఆర్టిస్ట్‌లందరినీ దగ్గరకు చేస్తే ఇలా ఉంటుంది అని కామెంట్ పెట్టారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌లో సారా కూడా ఉందని టాక్ నడుస్తోంది.
మరి ఇందులో నిజమెంత.. సారా కీలక పాత్రలో నటించనుందా.. లేక ఒక పాటలో మెరవనుందా.. వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఆ మధ్యన విజయ్ దేవరకొండ, సారా అలీ ఖాన్ ఫొటో ఒకటి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
కాగా యాక్షన్ ఎంటర్టైనర్గా లైగర్ తెరకెక్కుతోంది. ఇందులో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న ఈ మూవీ విడుదల కానుంది. 2019లో ఇస్మార్ట్ శంకర్ విజయం తరువాత పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకొంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.