హోమ్ /వార్తలు /సినిమా /

Corona Effect: ట్రైన్ భోగీని శుభ్రం చేసిన బాలయ్య హీరోయిన్..

Corona Effect: ట్రైన్ భోగీని శుభ్రం చేసిన బాలయ్య హీరోయిన్..

లాక్‌డౌన్ సమయంలో కలవలేకపోవడంతో కూతురు ఛాయకు వీడియో కాల్ చేసి రుద్ర ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. రోజుకు కనీసం ఒక్కసారైనా బుడ్డోన్ని చూడకుండా ఉండలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చింది రవీనా టాండన్.

లాక్‌డౌన్ సమయంలో కలవలేకపోవడంతో కూతురు ఛాయకు వీడియో కాల్ చేసి రుద్ర ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. రోజుకు కనీసం ఒక్కసారైనా బుడ్డోన్ని చూడకుండా ఉండలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చింది రవీనా టాండన్.

Raveena Tandon: ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే ప్రస్తుతం కరోనా తప్ప మరోటి వినిపించడం లేదు. ఎవర్ని కదిపినా కూడా ఇదే జరుగుతుంది.. దీని గురించే చెబుతున్నారు.

ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే ప్రస్తుతం కరోనా తప్ప మరోటి వినిపించడం లేదు. ఎవర్ని కదిపినా కూడా ఇదే జరుగుతుంది.. దీని గురించే చెబుతున్నారు. దానికితోడు సెలబ్రిటీలు మొత్తం బయటికి వచ్చి 'సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్'తో పాటు.. 'జనతా కర్ఫ్యూ'కి మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా తన వంతు బాధ్యతగా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ మధ్యే బాంద్రాకు వెళ్లి అక్కడ ట్రైన్‌లో క్యాబిన్‌ను శానిటైజర్‌ వేసి శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రవీనా.


మొహానికి మాస్కు కట్టుకుని అక్కడున్న సీట్లతో పాటు ఆ భోగీని శుభ్రం చేస్తుంది రవీనా టాండన్. ఇది చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఈ బాధలు ఉండవు కదా అంటూ చెప్పుకొచ్చింది రవీనా టాండన్. తాను కూర్చున్న చోటును శానిటైజర్‌ వేసి శుభ్రం చేసినట్లు తెలిపింది ఈమె.. దాంతో బాగా సౌకర్యంగా అనిపించిందని.. మరీ అత్యవసరం అనుకుంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సలహా కూడా ఇచ్చింది ఈ బ్యూటీ. ఈమె తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. ముఖ్యంగా బాలయ్యతో నటించిన బంగారు బుల్లోడుతో బాగా పాపులర్ అయింది రవీనా టాండన్.

First published:

Tags: Raveena Tandon, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు