హోమ్ /వార్తలు /సినిమా /

మలైకా అరోరా విడాకుల వెనక ఉన్న అసలు కథ ఇదే..

మలైకా అరోరా విడాకుల వెనక ఉన్న అసలు కథ ఇదే..

మలైకా అరోరా(malaika arora/Instagram)

మలైకా అరోరా(malaika arora/Instagram)

Malaika Arora: మలైకా అరోరా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు నుంచి హిందీ వరకు అన్ని భాషల ఆడియన్స్‌కు బాగా పరిచయం. పాతికేళ్ల కింద ఛయ్య ఛయ్య..

మలైకా అరోరా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు నుంచి హిందీ వరకు అన్ని భాషల ఆడియన్స్‌కు బాగా పరిచయం. పాతికేళ్ల కింద ఛయ్య ఛయ్య అంటూ నడుమూపిన ఈ బ్యూటీ.. 47 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది. తెలుగులో కూడా 13 ఏళ్ల కింద అతిథి సినిమాలో మహేష్ బాబుతో రాత్రైనా నాకు ఓకే అంటూ ఓ సారి.. ఆ తర్వాత ఐదేళ్లకు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కెవ్వుకేక అంటూ స్టెప్పులేసి ఇక్కడ కూడా బాగానే గుర్తింపు తెచ్చుకుంది మలైకా. ఇప్పటికీ క్రేజ్ విషయంలో అస్సలు తగ్గనంటుంది ఈ ముద్దుగుమ్మ.

మలైకా అరోరా(Photo: Instagram)
మలైకా అరోరా(Photo: Instagram)

ఇదిలా ఉంటే 22 ఏళ్ళ కింద 1998లో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్ఫాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది ఈమె. 19 ఏళ్ల పాటు కలిసున్న ఈ ఇద్దరు.. పరస్పర అంగీకారంతోనే 2017లో విడిపోయారు. ఈ ఇద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయినప్పటికీ వీళ్లు విడిపోయారు. ఆ తర్వాత అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది మలైకా. ఓ రకంగా ఈ ఇద్దరూ విడిపోవడానికి కారణం కూడా అర్జున్ కపూర్‌తో మలైకాకు ఉన్న ఎఫైర్ అనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే విడాకులు తీసుకోవాలనుకున్నపుడు తనను చాలా మంది తిట్టారని.. ఇలాంటి సమయంలో విడాకులు తీసుకోవడం అస్సలు మంచిది కాదని చెప్పారని చెబుతుంది మలైకా.

మలైకా అరోరా అర్జున్ కపూర్ (Twitter)
మలైకా అరోరా అర్జున్ కపూర్ (Twitter)

కానీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే బతకడం కూడా కష్టమవుతుందని చెబుతుంది ఈమె. అవన్నీ ఆలోచించిన తర్వాతే అర్భాజ్, తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పింది మలైకా. దాంతో పాటు విడిపోవడానికి ముందు రోజు రాత్రి తన కొడుకు తన దగ్గరికి వచ్చి.. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి.. ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయ్ అంటూ చెప్పాడని గుర్తు చేసుకుంది మలైకా అరోరా. అలాంటి క్లిష్ట సమయంలో తన కొడుకు తనతో పాటే ఉన్నాడని చెప్పుకుంది ఈమె. ఇక ఇప్పుడు అర్జున్ కపూర్‌తో మలైకా.. ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో అర్బాజ్ ఖాన్ ప్రేమలో ఉన్నారు.

First published:

Tags: Arjun Kapoor, Hindi Cinema, Malaika Arora, Telugu Cinema

ఉత్తమ కథలు