Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: August 12, 2019, 3:48 PM IST
కియారా అద్వానీ Photo : Instagram.com/kiaraaliaadvani
భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. దానికి ముందే హిందీలో ఎమ్మెస్ ధోనీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది కియారా. ఇక ఈ ఏడాది రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది ఈ భామ. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు కియారా టైమ్ నడుస్తుంది. స్టార్ హీరోలంతా పోటీ పడి మరీ ఈ ముద్దుగుమ్మతో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లోనూ ఈమెకు వరస అవకాశాలు వస్తున్నాయి.

కియారా అద్వానీ (ఫైల్ ఫోటో)
ఇలాంటి సమయంలో తెలుగు, తమిళ నుంచి కూడా కియారా స్టార్ అయిపోయింది. ఈ మధ్యే కబీర్ సింగ్ సినిమాతో హిందీలో కూడా సంచలనాలు సృష్టించింది. ఈ చిత్రం ఏకంగా 280 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఈమెకు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న విజయ్.. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కియారాను హీరోయిన్గా ఎంచుకున్నారని తెలుస్తుంది.

కియారా అద్వానీ విజయ్ (Source: Twitter)
చాలా రోజుల నుంచి తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లడానికి కియారా ఆసక్తిగా చూస్తుంది. ఇలాంటి సమయంలో విజయ్ సరసన నటించే ఆఫర్ వస్తే మాత్రం అంతకంటే కావాల్సింది మరోటి లేదు. ఈ సినిమా కానీ హిట్ అయితే తమిళనాట సింగిల్ సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం. ఇప్పటికే తెలుగులో మహేష్ లాంటి స్టార్ సినిమాతో పరిచయం అయింది. హిందీలో కూడా స్టార్ హీరోలతో నటిస్తుంది. ఇక తమిళనాట విజయ్ను లైన్లో పెట్టేస్తుంది కియారా. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న గుడ్ న్యూస్, లక్ష్మీ బాంబ్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
August 12, 2019, 3:48 PM IST