హోమ్ /వార్తలు /సినిమా /

సెక్స్ టాయ్ గురించి గూగుల్ చేసానంటున్న కియారా అద్వానీ..

సెక్స్ టాయ్ గురించి గూగుల్ చేసానంటున్న కియారా అద్వానీ..

లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో కియారా అద్వాని (Kiara Advani/Youtube)

లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో కియారా అద్వాని (Kiara Advani/Youtube)

Kiara Advani: 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ కియారా అద్వానీ. దానికంటే ముందే ధోనీ సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాలు చేస్తూనే..

'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ కియారా అద్వానీ. దానికంటే ముందే ధోనీ సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాలు చేస్తూనే మధ్యలో వెబ్ సిరీస్‌లు కూడా నటించడం ఈమెకు అలవాటు. అలా చేసిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్'. ఇందులో కియారా నటనకు అంతా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా బోల్డ్ సీన్స్‌లో కూడా కుమ్మేసింది. ఈమె నటన చూసి వామ్మో అని అంతా ముక్కున వేలేసుకున్నారు కూడా. పెళ్లి తర్వాత కూడా సెక్సువల్ లైఫ్ సరిగ్గా ఎంజాయ్ చేయలని గృహిణి పాత్రలో ఇందులో నటించింది కియారా. నేషనల్ అవార్డ్ విన్నర్ విక్కీ కౌశల్ హీరో.

కియారా అద్వానీ (kiara adwani)
కియారా అద్వానీ (kiara adwani)

పెళ్లి తర్వాత శృంగారంలో తృప్తి లేక గృహిణిలు పడే ఇబ్బందులు ఈ పాత్రలో చూపించింది కియారా. అయితే ఇందులో మరీ ఇంత బోల్డుగా ఉన్న కియారాను చూసి కొందరు విమర్శించారు కూడా. అయితే నటిగా మాత్రం ఈమెకు మంచి మార్కులు వేసింది లస్ట్ స్టోరీస్. ఇందులో వైబ్రేటర్ వాడే సన్నివేశంలో నటించి అందరినీ షాక్ ఇచ్చింది కియారా. ఇదే ఎపిసోడ్‌లో మరో నటి నేహ దుపియా కూడా వైబ్రేటర్ సీన్ చేసింది. నిజానికి ఆమె నుంచే దీని గురించి తెలుసుకుంటుంది కియారా. వాళ్లిద్దరూ మాట్లాడుకునే మాటలు కూడా వైరల్ అయ్యాయి.

లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో కియారా అద్వాని, నేహా దూపియా(Kiara Advani/Youtube)
లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో కియారా అద్వాని (Kiara Advani/Youtube)

ఈ సన్నివేశంలో నటించే ముందు రోజు రాత్రి తనకు అసలు నిద్ర పట్టలేదని.. చాలా టెన్షన్ పడినట్లు చెప్పుకొచ్చింది. మహిళలు వైబ్రేటర్ ఎలా వాడతారో తనకు తెలియదని.. అందుకే దాన్ని గూగుల్ చేసి తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది కియారా. 'అగ్లీ అండ్ ట్రూత్' లాంటి కొన్ని సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలున్నాయని తెలిసి చూసి తెలుసుకున్నట్లు చెప్పింది ఈమె. సెక్స్ టాయ్ సీన్ మాత్రం చాలా వైరల్ అయిపోయింది. ఇదిలా ఉంటే లస్ట్ స్టోరీస్ తర్వాత తెలుగు, హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది ఈ భామ.

లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో కియారా అద్వాని (Kiara Advani/Youtube)
లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో కియారా అద్వాని (Kiara Advani/Youtube)

ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న 'భూల్ భూలైయా 2'తో పాటు 1999 కార్గిల్ యుద్ధంలో తన ప్రాణాలను త్యాగం చేసిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన 'షెర్షా' సినిమాలో నటిస్తుంది కియారా. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సిధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్నారు. 'ఇందూ కి జవానీ', లారెన్స్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న కాంచన రీమేక్ 'లక్ష్మీ బాంబ్' లో కూడా కియారా నటిస్తుంది. తెలుగులో మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Kiara advani, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు