Kiara Advani: అమ్మో.. మేకప్ లేకపోతే కియారా అద్వానీ ఇలా ఉంటుందా..?

మేకప్ లేని కియారా అద్వానీ ఫోటో (Kiara Advani)

Kiara Advani: హీరోయిన్స్ అందాలన్నీ మేకప్ చాటునే ఉంటాయి. కొందరు మాత్రమే మేకప్ ఉన్నా లేకపోయినా అందంగా కనిపిస్తుంటారు.

  • Share this:
హీరోయిన్స్ అందాలన్నీ మేకప్ చాటునే ఉంటాయి. కొందరు మాత్రమే మేకప్ ఉన్నా లేకపోయినా అందంగా కనిపిస్తుంటారు. వాళ్లనే నేచురల్ బ్యూటీస్ అంటారు. సాయి పల్లవిలా అన్నమాట.. ఈ ముద్దుగుమ్మ మేకప్ చాలా తక్కువగా వాడుకుంటుంది. కానీ కొందరు మాత్రం కేవలం మేకప్‌లోనే అందంగా కనిపిస్తుంటారు. నమ్మరు కదా.. కావాలంటే ఇక్కడ కియారా అద్వానీని చూడండి. అసలు ఇక్కడున్నది కియారానేనా అనే అనుమానం వస్తుంది కదా..? కచ్చితంగా ఈ భామే కాకపోతే మేకప్ లేకుండా ఉందంతే. అమ్మో అంత తేడా ఉంటుందా అనుకునేలా ఉంది కియారా అద్వానీ. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి.. ఆ తర్వాత వినయ విధేయ రామతో ఇక్కడే ఉండిపోవాలని ట్రై చేసింది. కానీ విజయం తర్వాత అపజయం పలకరించడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది ఈ బ్యూటీ. అక్కడే జెండా పాతాలని చూస్తుంది. తెలుగులో అవకాశాలు వచ్చినా కూడా ఒప్పుకోవడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈమె మేకప్ లేని ఫోటో బయటికి వచ్చింది. అది చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మేకప్ లేని కియరాని చూడలేం బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. బయటకి వచ్చేటప్పుడు కచ్చితంగా మేకప్‌తోనే రండి మేడమ్ అంటూ కొందరు కామెంట్ కూడా చేస్తున్నారు. మరికొందరు అయితే మేకప్‌పై శ్రద్ధ తీస్కో అంటూ సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది కియారా. అక్కడ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న భూల్ భూలైయా 2తో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా సొంతం చేసుకుంది.
Published by:Praveen Kumar Vadla
First published: