కియారా అద్వానీ కొత్త లగ్జరీ కార్ రేట్ ఎంతో తెలుసా..?

కియారా న్యూడ్ ఫోటో షూట్ (Image: Kiara Advani/Twitter)

Kiara Advani: కియారా అద్వానీ.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఈ భామ పేరుకు క్రేజ్ బాగా ఎక్కువగా ఉంది. అన్ని భాషల్లోని హీరోలు కూడా ఈమె డేట్స్ కావాలంటున్నారు ఇప్పుడు.

  • Share this:
కియారా అద్వానీ.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఈ భామ పేరుకు క్రేజ్ బాగా ఎక్కువగా ఉంది. అన్ని భాషల్లోని హీరోలు కూడా ఈమె డేట్స్ కావాలంటున్నారు ఇప్పుడు. తెలుగులో ఇప్పటికే భరత్ అనే నేను. వినయ విధేయ రామ లాంటి సినిమాలు చేసింది కియారా. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ వరస సినిమాలు చేస్తున్న కియారా.. తెలుగుకు రమ్మంటే రావడం లేదు. ఈ మధ్యే మళ్లీ మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినా కూడా వదిలేసుకుందనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం హిందీలో వరస విజయాలతో పాటు అవకాశాలు కూడా వస్తుండటంతో తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిపోతుంది ఈమె.
కియారా అద్వానీ (Instagram/Photo)
కియారా అద్వానీ (Instagram/Photo)

దానికితోడు ఒక్కో సినిమాకు కోట్లకు కోట్లు తీసుకుంటుంది కియారా. దాంతో ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకుంటుంది. ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపు 100 నుంచి 200 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. అందులోనూ షాహిద్ కపూర్‌తో నటించిన కబీర్ సింగ్ అయితే 350 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో ఈమె అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు.. ఇంకోవైపు యాడ్స్.. ఫోటోషూట్స్ ఇలా అన్నివైపులా సంపాదిస్తుంది.
కియారా అద్వానీ (Instagram/Photo)
కియారా అద్వానీ (Instagram/Photo)

దాంతో లగ్జరీ లైఫ్ కూడా లీడ్ చేస్తుంది కియారా. ఇప్పుడు ఈ భామ సూపర్ కార్ ఒకటి తీసుకుంది. ఇ-క్లాస్ 220 డి వైట్ స్పార్క్లింగ్ బెంజ్ కారు కొనేసింది కియారా. దీని రేట్ అక్షరాలా 65 లక్షలు. ఇందులోనే ప్రస్తుతం రైడ్స్ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈమెతో BMW 5 సిరీస్ ఉంది. ఈ కారును ఇప్పుడు పక్కనబెట్టి కొత్త కారులోనే షికారు చేస్తుంది. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ సినిమాతో పాటు .. కరణ్ జోహార్ నిర్మిస్తున్న రెండు సినిమాలతో బిజీగా ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published: