మన హీరోయిన్లకు మొహమాటం అనే మాటకు అస్సలు అర్థం తెలియదు.. తెలిసినా కూడా మొహమాటానికి కూడా మొహమాటపడరు. అన్నీ ఓపెన్‌గానే మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా ఇదే చేసింది. ఎవరైనా అమ్మాయిని బెడ్రూమ్ సీక్రేట్స్ గురించి చెప్పమంటే సిగ్గుతో తల దించుకుంటారు.. లేదంటే మొహమాటంతో తల తిప్పుకుంటారు. కానీ కరీనా మాత్రం అలా కాదు.. బెడ్రూమ్లో ఏం చేస్తుంటారు.. అక్కడ ఏమేం తీసుకెళ్తుంటాం అనే విషయాలను కూడా పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చింది. తనకు మూడ్ రావాలంటే ఏం చేయాలో కూడా ఓపెన్ అయిపోయింది కరీనా కపూర్. ఆ మూడు బెడ్రూమ్లో లేకపోతే తాను ఉండలేనంటూ మనసులో మాట ఓపెన్‌గా ఓపెన్ అయిపోయింది కరీనా. అసలు విషయం ఏంటంటే.. స్టార్ వర్సెస్ ఫుడ్ పేరుతో డిస్కవరీ ప్లస్‌లో ఓ సెలబ్రిటీ కుకిరీ షో వస్తుంది. అందులో బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది వస్తున్నారు. మలైకా అరోరా, అర్జున్ కపూర్, కరణ్ జోహార్ సహా చాలా మంది సినీ ప్రముఖులు ఆ షోకు వచ్చి తమ కిచెన్ ముచ్చట్లతో పాటు ఇంకా చాలా విషయాల గురించి చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే కరీనా కపూర్ కూడా ఈ షోకు వచ్చింది. అందులో తన బెడ్రూమ్ గురించి యాంకర్ అడగ్గా ఏ మాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పుకొచ్చింది బెబో. తనకు బెడ్రూమ్లో మూడు విషయాలు మాత్రం కచ్చితంగా ఉండాలని చెప్పింది.
View this post on Instagram
అందులో సైఫ్ అలీ ఖాన్ మొదటి ఛాయిస్ అయితే.. వైన్ బాటిల్ రెండో ఛాయిస్.. ఇక పైజామాలు కూడా ఎప్పుడూ తనతో పాటే ఉండాలని క్లారిటీ ఇచ్చింది. వైన్ బాటిల్.. పైజామాస్.. సైఫ్ అలీ ఖాన్ అంటూ యాంకర్ ప్రశ్నకు బెడ్రూమ్ సీక్రేట్ బయటపెట్టింది. ఈ ప్రోమోతో పాటు వీడియో.. అలాగే కరీనా కపూర్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బాగున్నాయి మేడమ్ మీ బెడ్రూమ్ సీక్రేట్స్ అంటూ అభిమానులు కింద కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈమె కెరీర్ పరంగా కూడా బిజీగానే ఉంది. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ ఛద్దాలో నటిస్తుంది కరీనా. గతేడాది ఈమె గర్భంతో ఉండటంతో ముందుగానే కరీనా పార్ట్ పూర్తి చేసి పంపించేసారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం కొడుకు ఆలన పాలన చూసుకుంటుంది కరీనా కపూర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Kareena Kapoor