బాలీవుడ్ బ్యూటీ కరీన్ కపూర్ రెండోసారి తల్లి కాబోతుంది. ఈ విషయం ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది బెబో. ఆగస్టులోనే తాను గర్భవతిని అంటూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది కరీనా కపూర్ ఖాన్. ఇప్పటికే కరీనా, సైఫ్ జంటకు ఓ అబ్బాయి ఉన్నాడు. అతడే లిటిల్ సూపర్ స్టార్ తైమూర్ అలీ ఖాన్. మనోడు ఇప్పటికే సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు రెండో బేబీ కోసం చూస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలోనే కరీనా కపూర్ తన గర్భంతోనే బయటికి వస్తుంది. గ్లామర్ ఫీల్డులో ఉన్నారు కాబట్టి కొందరు హీరోయిన్లు తమ గర్భాన్ని చూపించుకోడానికి యిష్టపడరు. కానీ కరీనా మాత్రం అలాంటిదేం లేకుండా వచ్చేస్తుంది. తన బేబీ బంప్ చూపించుకోడానికి ఏ మాత్రం మొహమాటపడట్లేదు. ఈ మధ్యే ఢిల్లీలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చింది కరీనా. గర్భవతి కావడంతో తన పార్ట్ ముందుగానే పూర్తి చేయాలని సూచించింది బెబో. దాంతో దర్శకుడు కూడా అదే చేసాడు. ఇప్పుడు తన ఇంటి బయట వాకింగ్ చేస్తూ కనిపించింది కరీనా. భర్త సైఫ్తో కలిసి నడుస్తూ కెమెరాకు చిక్కింది కరీనా.
డెనిమ్ చొక్కా, బ్లాక్ లెగ్గింగ్స్లో కనిపించింది కరీనా. ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు కాస్త ఒళ్లు చేసి.. గర్భంతో కనిపించింది కరీనా. ఈ మధ్యే తాను గర్భం దాల్చి 5 నెలలు పూర్తయింది అంటూ ఒక సెల్ఫీని పోస్ట్ చేసింది బెబో. ఫిబ్రవరిలో సైఫ్, కరీనా జంటకు రెండో బిడ్డ పుట్టబోతున్నారు. అభిమానులు ఇప్పటికే కరీనా జంటకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది. కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో మాత్రమే నటిస్తుంది. ఈ చిత్రం 2021 క్రిస్మస్కు విడుదల కానుంది. గర్భం దాల్చడంతో ఇతర సినిమాలు ఒప్పుకోలేదు కరీనా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hindi Cinema, Kareena Kapoor, Saif Ali Khan, Telugu Cinema