Home /News /movies /

BOLLYWOOD BEAUTY KAJOL REVEALS HER FATHER WAS AGAINST HER MARRIAGE MS

Kajol: ఆ పని చేస్తానంటే కాజోల్ తండ్రి అస్సలు ఒప్పుకోలేదట.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బ్యూటీ

కాజోల్ (ఫైల్)

కాజోల్ (ఫైల్)

Kajol: నటిగా మంచి సక్సెస్ లతో దూసుకుపోతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె తండ్రి షోము ముఖర్జీ చెప్పారట. కూతురు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని వాదించాడట...

  • News18
  • Last Updated :
    కాజోల్.. తొలి సినిమా బెఖుడి నుంచి ఇటీవల వచ్చిన తానాజీ దాకా తిరుగులేని ఇమేజీతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాజీగర్ సినిమాతో (కాజోల్ కు ఇది రెండో సినిమా) ఈ బ్యూటీ దశ తిరిగింది. ఆ సినిమా తర్వాత కాజోల్, షారుఖ్ ల జోడి ఒక సంచలనం. ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే బాక్సాఫీస్ బొనాంజాలే. అయితే యాక్టింగ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే కాజోల్ పెళ్లి చేసుకుంది. అయినా ఈ నటికి అవకాశాలేమీ తగ్గలేదు. కాజోల్ అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకున్న విషయం విదితమే. రెండు దశాబ్దాలుగా ఈ జంట తమ వివాహ జీవితాన్ని సంతోషంగా ఆనందిస్తున్నది. అయితే తన పెళ్లికి సంబంధించి మాత్రం చేసిన ఒక పని తన తండ్రికి నచ్చలేదట... ఈ విషయాన్ని కాజోలే వెల్లడించింది.

    యాక్టింగ్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కాజోల్ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇదే విషయాన్ని ఆమె తన తండ్రి షోము ముఖర్జీకి చెప్పిందట. అయితే అప్పటికీ ఆమెకు వయసు 24 సంవత్సరాలు మాత్రమే. నటిగా మంచి సక్సెస్ లతో దూసుకుపోతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె తండ్రి చెప్పారట. పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని వాదించాడట.. పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయనే నానుడి ఉంది. అంతేగాక రంగుల ప్రపంచంలో పెళ్లైన హీరోయిన్ అంటే దర్శక నిర్మాతలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరనే భావన ఉంది. నటిగా ప్రూవ్ చేసుకుంటున్న ఈ తరుణంలో పెళ్లి వంటివి ఎందుకని షోము ముఖర్జీ వాదించారట.

    కానీ కాజోల్ మాత్రం తండ్రి తో పనయ్యేలా లేదని.. తల్లి ద్వారా ప్రయత్నించిందట. కాజోల్ తల్లి తనూజా.. కూతురు పెళ్లికి అంగీకరించిందట. ఆమె తనకు అతి పెద్ద మద్దతుదారుగా ఉందని కాజోల్ వెల్లడించింది. తన తల్లి తనకు ధైర్యం ఇచ్చిందని.. తాను చేయాలనుకున్నది చేసేందుకు ఎంతో సాయపడిందని చెప్పుకొచ్చిందీ కలల రాణి. తండ్రి అంటే ఎంతో ఇష్టపడే కాజోల్.. ఇటీవలే తన తండ్రి గురించి ఆయనను స్మరించుకుంటూ సామాజిక మాధ్యమాలలో ఒక నోట్ రాసింది. అందులో ఈ విషయాలను వెల్లడించింది.

    ఇక కాజోల్ పెళ్లి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తో 1999, ఫిబ్రవరి 24 న జరిగింది. 22 సంవత్సరాల వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలు.. కూతురు నైసా దేవగన్, కుమారుడు యుగ్ దేవగన్. ప్రస్తుతం కాజోల్.. తన కూతురు చదువు నిమిత్తం తనతో కలిసి సింగపూర్ లోనే ఉంటున్నారు. అజయ్.. యుగ్ తో కలిసి ముంబయిలో ఉంటున్నారు. చివరిసారిగా ఈ జంట అజయ్ దేవగన్ స్వీయ నిర్మాణంలో వచ్చిన తానాజీ సినిమాలో నటించారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Ajay Devgn, Bollywood, Bollywood heroine, Bollywood news, Kajol

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు