Home /News /movies /

BOLLYWOOD BEAUTY DISHA PATANI AND HER RUMORED BOYFRIEND TIGER SHROFF ENJOYING NEW YEAR IN MALDIVES PK GH

Disha Patani: ఛలో మాల్దీవ్స్.. బాయ్‌ఫ్రెండ్‌తో దిశా పటానీ న్యూ ఇయర్ వెకేషన్..

దిశా పటానీ హాట్ షో (Disha Patani hot show/instagram)

దిశా పటానీ హాట్ షో (Disha Patani hot show/instagram)

Disha Patani Bikini show: మాల్దీవుల్లో తన బాయ్ ఫ్రెండ్.. టైగర్ ష్రాఫ్ ( Tiger Shroff) తో కలిసి న్యూ ఇయర్‌కు వెల్కం చెప్పనున్న దిషా పటాని ఎప్పటికప్పుడు తన బీచ్ వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. రూమర్డ్ కపుల్‌గా బాలీవుడ్ సర్కిల్‌లో..

ఇంకా చదవండి ...
మాల్దీవుల్లో తన బాయ్ ఫ్రెండ్.. టైగర్ ష్రాఫ్ ( Tiger Shroff) తో కలిసి న్యూ ఇయర్‌కు వెల్కం చెప్పనున్న దిషా పటాని ఎప్పటికప్పుడు తన బీచ్ వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. రూమర్డ్ కపుల్‌గా బాలీవుడ్ సర్కిల్‌లో పేరుగాంచిన దిషా-టైగర్ ఇటీవలే ఫ్యామిలీతో దుబై ట్రిప్ ఎంజాయ్ చేశారు. బీచ్ లో చిల్ అవుతున్న ఈమె స్టన్నింగ్ సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. నో-మేకప్ లుక్ లో కూడా గ్లామరస్ గా కనిపిస్తున్న దిషాకు పోటీగా టైగర్ కూడా ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. తన యాబ్స్ తో దిమ్మదిరిగే ఫిజిక్ తో టైగర్ ఈ లేటెస్ట్ పిక్స్ లో కనిపిస్తున్నారు. కాగా వీరిద్దరూ కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించినప్పటికీ ముందు వీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియదు. మాల్దీవ్స్ లో (Maldives) ల్యాండ్ అయిన ఈ జంట సోలో పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ, అదికూడా ఒకే బ్యాక్ గ్రౌండ్లో వీటిని షూట్ చేయటంతో వీరు మాల్దీవ్స్ లో విహరిస్తున్నట్టు ఆవెంటనే స్పష్టమైపోయింది. 2020లో 'మలాంగ్' సినిమాతో ఫిబ్రవరిలో ప్రేక్షకులను దిషా పలకరించారు. కాగా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన 'రాధే' చిత్రంలో నటిస్తున్న దిషా నెక్ట్స్ ఏక్తా కపూర్ చిత్రం 'కేటీనా', 'ఏక్ విలన్ 2'లోనూ నటిస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న 'పుష్ప' (Pushpa) సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం దిషాను సంప్రదిస్తే ముందు ఓకే చెప్పిన ఈమె ఆతరువాత హ్యాండ్ ఇచ్చినట్టు ఫిలిం నగర్ లో జోరుగా పుకారు షికారు చేస్తోంది. పుష్పలో ఐటెం సాంగ్ కోసం ఈమె ఏకంగా 1.5 కోట్లు డిమాండ్ చేశారట. దీంతో ఓ స్టేజ్ లో దర్శక, నిర్మాతలు ఆమెను తీసుకోవటంపై పునరాలోచనలో పడ్డారనే టాక్ వినిపించింది కూడా. ఈ లోగా ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న పుష్పలో అంతకు ముందు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నారనే వార్త వచ్చినప్పటికీ అది కూడా కన్ఫర్మ్ కాలేదు. ఈనేపథ్యంలో పుష్పకు అప్పట్లో విజయ్ సేతుపతి తాజాగా దిషా షాక్ ఇచ్చారన్నమాట.

ఇక పూరీ జగన్నాథ్ సినిమా 'లోఫర్' తో సినిమాతో తెరంగేట్రం చేసిన దిషా ఇప్పుడు తెలుగు సినిమాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదు. బికినీ క్లాడ్ లో దిషా పటానీకి ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ అందగత్తె బికినీలో అలా పిక్ అప్లోడ్ చేసిందంటే చాలు నిమిషాల్లోనే బోలెడన్ని లైకులు, షేర్లు వచ్చిపడతాయి. ఇన్స్టాలో ఈమెకున్న ఫాలోయింగ్ 41.2 మిలియన్లకు పైమాటే. బాలీవుడ్ బీచ్ హాటీగా కనిపించే దిషాకు మంచి డ్యాన్సింగ్ స్కిల్ తో పాటు ఫైటింగ్ స్కిల్ కూడా ఉందని గతంలో ఆమె నటించిన చిత్రాలే చెబుతున్నాయి.

దిశా పోస్ట్ చేసిన లేటెస్ట్ ఓబికినీ ఫోటో జస్ట్ 3 గంటల్లో1,498,937 లైకులు కొల్లగొట్టిందంటే ఇన్స్టాలో ఈమెకున్న క్రేజీ ఫాలోయింగ్ ఇట్టే అర్థమైపోతుంది. యెల్లో కలర్లో టూ పీస్ బికినీ వేసుకున్న దిషా..సర్ఫింగ్ బోర్డ్ పై అలా చూస్తున్న ఈ ఇమేజ్ వెర్రెక్కించేలా ఉంది. దిశా బికినీలు చాలా అందంగా ఉంటాయి. ఈ ఫొటోను నవంబర్ 19న దిషా పోస్ట్ చేయగా 3,094,322 లైకులను ఇది రాబట్టింది. తన ఫిట్నెస్ తో ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు కనువిందు చేసే దిషా.. ప్రస్తుతం తానెక్కడుందనే విషయాన్ని మాత్రం ఎవరికీ తెలియనివ్వలేదు.

బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీగా ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ వెకేషన్ కు చెక్కేసిన ఈమె చేతినిండా సినిమాలతో, ఎండార్స్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఏమాత్రం టైం దొరికినా అలా బీచ్ ల వెంట తిరిగే దిషా నవంబర్ 13 చేసిన ఫొటో పోస్ట్ నెటిజన్స్ తో వావ్ అనిపించేలా ఉంది. 3 మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన ఈ ఫొటోలో దిషా అదిరిపోయేలా కనిపిస్తున్నారు.

బాలీవుడ్ లో తరచూ ఇలా బికినీల్లో కనిపించే సూపర్ ఫిజిక్ ఉన్న దిషా ఈ ఫొటోలో చూడండి యెల్లో మోనోకినీలో కళ్లుచెదిరేలా కనిపిస్తున్నారు. అక్టోబర్ 5న పోస్ట్ చేసిన ఈ ఫొటో కూడా 2.5 మిలియన్లకు పైగా లైకులు పొందింది. డార్క్ ఫ్లోరల్ మోనోకినీలో సముద్రపు ఒడ్డున దేవకన్యలా కనిపిస్తున్న దిషా సన్ కిస్డ్ లుక్స్ తో అదరగొట్టారు కదూ. సుమారు 2.5 మిలియన్ల లైకులు కొట్టించుకున్న ఈ ఫొటో చూస్తే ఆమె టోన్డ్ బాడీ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Disha Patani, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు