BOLLYWOOD BADSHA SHAH RUKH KHAN AND PRIYANKA CHOPRA CUTEST BREAKUP LOVE STORY IN BOLLYWOOD NR
Shahrukh Khan - Priyanka Chopra: ప్రియాంకకు ముద్దు పెట్టాడు.. విడాకులు ఇస్తానన్న షారుఖ్ ఖాన్ భార్య..?
Shahrukh Khan - Priyanka Chopra
Shahrukh Khan - Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి బాలీవుడ్ స్టార్ హీరో గా నిలిచాడు.
Shahrukh Khan - Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి బాలీవుడ్ స్టార్ హీరో గా నిలిచాడు. ఎంతో మంది హీరోయిన్స్ తో నటించిన షారుఖ్ ఖాన్ ఎక్కువగా కాజోల్, ప్రియాంక లతో మంచి సన్నిహితం పెంచుకున్నాడు. ఇక ప్రియాంక చోప్రా తో కేవలం రెండు సినిమాలలో నటించగా ఏకంగా తనతో జీవితం పంచుకోవాలనుకున్నాడు షారుఖ్. కానీ అంతటి అదృష్టం నోచుకోలేదు ఈ జంట.
కానీ అప్పటికి షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాడు. నిజానికి షారుఖ్, ప్రియాంక కలిసి నటించక ముందే మంచి స్నేహితులుగా ఉండేవారట. బాలీవుడ్ లో పలు పార్టీల్లో వారి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలిసింది. ఇక అప్పటినుంచి వారిద్దరి మధ్య మరింత సన్నిహితం ఏర్పడగా పలు పార్టీలలో కలిసి తిరిగేవారట. అంతేకాకుండా తెలియని వాళ్ల పార్టీకి కూడా ప్రియాంకను పిలిచిపించేవాడట షారుఖ్.
ఇక పార్టీకి వచ్చిన ప్రియాంకను బుగ్గ మీద ముద్దులు పెడుతూ రిసీవ్ చేసుకునేవాడట. ఇలా ప్రతిసారి జరగడంతో ఆయన భార్య గౌరీ సహించలేకపోయింది. అతని తీరు పట్ల గౌరీ గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట షారుఖ్ కు. ప్రియాంక చోప్రా తో తిరగడమే కాకుండా కలిసి నటించకూడదని తనతో సినిమా అవకాశాలు వచ్చినా కూడా వదిలేయమని చెప్పిందట. ఒకవేళ తన మాట వినకపోతే విడాకులు ఇస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. ఇక దీంతో షారుఖ్ ఏమి చేయలేక తన భార్య మాటకు గౌరవం ఇచ్చాడట. ఇక అప్పటినుండి తన ఫ్యామిలీతో బాగా ఉంటూ ప్రియాంక దూరమవుతూ వచ్చాడు. ఇక ప్రియాంక నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.