BOLLYWOOD ACTRESS ZAREEN KHAN ON HOW COMPARISONS WITH KATRINA KAIF AFFECTED ON HER MNJ
Zareen Khan: కత్రినా పోలికలే నా కొంప ముంచాయి.. బాలీవుడ్ నటి ఆవేదన
జరీనా ఖాన్
Zareen Khan: కత్రినా కైఫ్ పోలికలే తన కొ్ంప ముంచాయి అంటోంది బాలీవుడ్ నటి జరీనా ఖాన్. 2010 సంవత్సరంలో సల్మాన్ ఖాన్ నటించిన వీర్ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది జరీనా. అయితే ఎంట్రీ గ్రాండ్‌గా జరిగినప్పటికీ.. ఆమెకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు
Zareen Khan: కత్రినా కైఫ్ పోలికలే తన కొ్ంప ముంచాయి అంటోంది బాలీవుడ్ నటి జరీనా ఖాన్. 2010 సంవత్సరంలో సల్మాన్ ఖాన్ నటించిన వీర్ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది జరీనా. అయితే ఎంట్రీ గ్రాండ్‌గా జరిగినప్పటికీ.. ఆమెకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఏదో చిన్న చిన్న పాత్రలకు మాత్రమే జరీనా పరిమితం అయ్యారు. కాగా ఈ బ్యూటీ వచ్చిన కొత్తలో జరీనాను కత్రినాతో పోల్చారు చాలా మంది. కత్రినాకు డూప్‌లా ఉందంటూ జరీనాపై ముద్రను వేశారు. కాగా ఆ పోలికలే తన కొంప ముంచాయని ఆమె చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ బ్యూటీ.. కరీనా డూప్ అన్న ముద్ర నుంచి బయటకు వచ్చే అవకాశం తనకు ఇప్పటివరకు రాలేదని అన్నారు.
నేను కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచే ఈ పోలికలు నన్ను వెంటాడాయి. ఇప్పుడు ఉన్నంత పవర్‌ఫుల్‌గా అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు. అప్పట్లో న్యూస్ పేపర్ల మీదనే ఆధారపడే వాళ్లం. ప్రజలు నన్ను నన్నుగా నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదనిపించింది అని జరీనా ఫీల్ అయ్యారు.
ఇక తన శరీరంపై వచ్చిన కామెంట్లను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. వీర్ సినిమాలో నటించేందుకు శరీరాన్ని పెంచాలని మేకర్లు నాకు చెప్పారు. అందుకు నేను ప్రయత్నాలు మొదలుపెట్టా. అది కాస్త మారిపోయి చాలా లావు అయ్యా. నన్ను ఫాట్రీనా అని కూడా పిలచేవారు. నేను ఏదైనా కార్యక్రమానికి వెళ్లినప్పుడు కూడా నా గురించి మంచిగా రాయడం ఎవ్వరూ చేయలేదు. అందరూ నా బరువు మీదనే రాసేవారు. దీంతో చాలా బాధ అనిపించింది. రోజుకు 2 నుంచి 5 గంటలు వర్కౌట్లు చేసేదాన్ని. అలా చాలా రోజులు చేసిన తరువాత నాకు బోన్ వెయిట్ ఎక్కువ అని అర్థమైంది. నా శరీరాన్ని ఇబ్బంది పెట్టేకంటే మానసికంగా నన్ను నేను దృఢంగా చేసుకోవాలనుకున్నా. దాని కంటే ఏది నాకు ఎక్కువ అనిపించలేదు. అయినా 40 కేజీలు తగ్గినా కూడా నా బరువుపై కామెంట్లు ఆగలేదు. అది నాకు షాకింగ్‌గా అనిపించేది అని జరీనా ఆవేదన వ్యక్తం చేశారు.