హోమ్ /వార్తలు /సినిమా /

Urvashi Rautela: దేశీ లుక్ లో అదరగొట్టిన హాట్ బ్యూటీ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్..

Urvashi Rautela: దేశీ లుక్ లో అదరగొట్టిన హాట్ బ్యూటీ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్..

 image credits Instagram

image credits Instagram

Urvashi Rautela: నుదుట బొట్టు.. అల్లిన జడ.. సల్వార్ కమీజ్.. సంప్రదాయబద్దంగా ఉండేందుకు దీనికి మించిన ఉదాహరణాలు అక్కర్లేదు. కానీ ఒక ఫ్యాషన్ ఐకాన్ వేసుకుంటేనే అది సంచలనం. నిత్యం ఫ్యాషన్ డ్రెస్సులతో, హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొట్టే ఊర్వశి రౌతెలా.. తాజాగా దేశీ లుక్ లో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది.

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :

  మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌతెలా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆమె ఒక సంచలనం. ఫ్యాషన్ ఐకాన్ గా మంచి గుర్తింపు సంపాదించింది. ఏ సినిమా ఫంక్షన్ కు వెళ్లినా.. ఏ ఫోటో షూట్ కైనా.. తాజా ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవుతూ.. పొట్టి పొట్టి డ్రెస్ లతో మతి పోగొట్టే ఈ భామ.. తన పంథా మార్చింది. ఇటీవల ఆమె సంప్రదాయ సల్వార్ కమీజ్ వేసుకుంది. అంతేగాక నుదుటి మీద... బొట్టు పెట్టుకుని సంప్రదాయబద్దంగా తయారైంది. ఇది చూసిన అభిమానులు అసలు ఆమె ఊర్వశియేనా అని అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతున్నది.

  సల్వార్ కమీజ్ తో పాటు జుట్టును కూడా నీట్ గా జడేసుకున్న లుక్ కు సంబంధించిన వీడియోను ఆమె ఇన్స్టాగ్రాంలో అభిమానులతో పంచుకుంది. షాట్ డ్రెస్ లే గాక తన జుట్టుతో ప్రయోగాలు చేయడంలో ఈ అమ్మడు దిట్ట. కాగా ఇప్పుడు ఫ్యాషన్ మొత్తాన్ని పక్కనబెట్టి.. సంప్రదాయబద్దంగా కనిపించడం వెనక కారణమేంటన్న దానికి మాత్రం ప్రస్తుతం సస్సెన్స్. అయితే తన తర్వాతి సినిమా కోసమే ఊర్వశి ఇలా చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోను ఆమె తన సామాజిక మాధ్యమాలలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు మాత్రం.. ఇది నమ్మలేకపోతున్నారు.  బాలీవుడ్ లో సనమ్ రే, వర్జిన్ భానుప్రియ, హేట్ స్టోరీ 4 వంటి చిత్రాల్లో నటించి హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసిన ఊర్వశి రౌతెలా.. పలు వీడియో ఆల్బమ్స్ లో కూడా కనిపించింది. ఆమె ఇటీవలే టీవీ నటుడు మోహ్సిన్ ఖాన్ తో కలిసి ‘వో చాంద్ కహా సే లావోగి’ అనే వీడియోసాంగ్ చేసింది. కాగా ఆమె నటించిన ‘బ్లాక్ రోజ్’ అనే సినిమా త్వరలోనే తెలుగు, హిందీలలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Bollywood, Bollywood heroine, Bollywood hot heroines, Urvashi Rautela