Swara Bhaskar: గణేషుని దర్శనానికి వెళ్లి వచ్చేసరికి బాలీవుడ్ నటి చెప్పులు మాయం..

సాధారణంగా మనం గుళ్లకు వెళినపుడు ఏదో హడావుడిలో మన చెప్పులను చెప్పుల స్టాండ్‌లో కాకుండా ఏదో కొన్ని డబ్బులు మిగులుతాయనే కక్కుర్తితో కొంత మంది తమ చెప్పులను ఎక్కడో పక్కన ఒదిలేసి దర్శనానికి వెళుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటన ప్రముఖ నటి స్వర భాస్కర్ విషయంలో జరిగింది.

news18-telugu
Updated: September 13, 2019, 7:50 AM IST
Swara Bhaskar: గణేషుని దర్శనానికి వెళ్లి వచ్చేసరికి బాలీవుడ్ నటి చెప్పులు మాయం..
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Instagram/Photo)
news18-telugu
Updated: September 13, 2019, 7:50 AM IST
సాధారణంగా మనం గుళ్లకు వెళినపుడు ఏదో హడావుడిలో మన చెప్పులను చెప్పుల స్టాండ్‌లో కాకుండా.. ఏదో కొన్ని డబ్బులు మిగులుతాయనే కక్కుర్తితో కొంత మంది తమ చెప్పులను ఎక్కడో పక్కన ఒదిలేసి దర్శనానికి వెళుతుంటారు. మనం ఏసు కొచ్చినవి కొత్త చెప్పులు ఐతే.. తీరా దర్శనం అయ్యాక వచ్చి చూస్తే అవి మాయం అవ్వడం జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ప్రముఖ నటి స్వర భాస్కర్ విషయంలో జరిగింది. ఈ విషయాన్ని స్వర భాస్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. గణేష్ చతుర్ధి వేడుకల్లో భాగంగా ఆమె ముంబైలో ఫేమసైన లాల్ బాగ్చా రాజా దర్శనానికి వచ్చారు. ఆమె గణేషున్ని దర్శనం చేసుకొని వచ్చేసరికి ఆమె వేసుకొని వచ్చిన కొల్హాపూర్ చెప్పులు మాయమయ్యాయి. దీంతో ఆమె చెప్పులు లేకుండానే కారు వరకు నడుచుకుంటూ వెళ్లిన విషయాన్ని తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసింది.



 




Loading...

View this post on Instagram




 

Swara Bhasker Visits Lalbaughcha Raja for Darshan But Ends Up Losing Her Shoes; Watch Video #swarabhaskar #lalbaughcharaja #GanpatiCelebrations #tvwnewsindia #tvwnewsvideos


A post shared by TVW NEWS India (@tvwnewsindi) on





స్వర భాస్కర్ చెప్పులు చోరీ అవ్వడంపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడి ఆమె తన చెప్పులను స్టాండ్‌లో కాకుండా పక్కన ఒదిలి వెళ్లి ఉంటుంది. ఎవరో బిచ్చగాళ్లో మరెవరికే  ఆ చెప్పులు నచ్చి ఎత్తుకెళ్లి ఉంటారు అని  కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం  గణేషుని దర్శనానికి వచ్చినపుడు కారులో చెప్పులు విడిచిపెట్టి వస్తే.. ఈ తిప్పలు ఉండేవి కావుగా అని స్పందిస్తున్నారు. ఏమైనా  దేవుని దర్శనానికి వచ్చి స్వర భాస్కర్ చెప్పలు పోగోట్టుకోవడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...