Sunny Leone: అది రాకుండా సేఫ్టీ వాడాలంటున్న సన్నీ లియోన్..

Sunny Leone: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది రాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచిస్తుంది సన్నీ లియోన్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 31, 2020, 8:00 AM IST
Sunny Leone: అది రాకుండా సేఫ్టీ వాడాలంటున్న సన్నీ లియోన్..
సన్నీ లియోన్ (Sunny leone)
  • Share this:
సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాలా.. ఈమె గురించి తెలియని వాళ్లెవరుంటారు చెప్పండి..? వరసగా కొన్నేళ్ల నుంచి గూగుల్ తల్లిని ఈమె గురించే ఎక్కువగా అడుగుతున్నారు నెటిజన్లు. అంతగా పాపులర్ అయింది సన్నీ లియోన్. సినిమాలు చేసినా చేయకపోయినా ఈమె క్రేజ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఏదైనా ఓ విషయం సన్నీ నోటి నుంచి వస్తే అది వైరల్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా సన్నీ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ప్రతీ చిన్న విషయాన్ని కూడా అక్కడ అభిమానులతో పంచుకోవడం ఈమెకు అలవాటు. ఇప్పుడు కూడా ఇదే చేసింది సన్నీ లియోన్.

సన్నీ లియోన్ (Sunny leone)
సన్నీ లియోన్ (Sunny leone)


సమాజ సేవ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తనకు చేతనైనంత వరకు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టిప్స్ చెబుతూనే ఉంటుంది సన్నీ. ఇప్పుడు కరానా వైరస్ గురించి తన భర్తతో కలిసి సేఫ్టీ సూత్రాలు చెబుతుంది. తాజాగా భర్త డేనియల్‌తో కలిసున్న ఫోటోను ట్వీట్ చేసింది సన్నీ. అందులో వింతేముంది అనుకుంటున్నారా..? ఆ ఫోటోలో మొహానికి మాస్క్ కట్టుకుని ఉంది సన్నీ. ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఇలా ఇద్దరూ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. మాస్క్ ధరించి అందరిని ఆశ్చర్యపర్చారు.. అంతేకాకుండా అందర్నీ ఇలాగే మాస్క్ ధరించాలని కోరారు సన్నీ జంట.



ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది రాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచిస్తుంది సన్నీ లియోన్. ప్రమాదం ఏ వైపు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదని.. మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కదా అంటుంది సన్నీ. కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండంటూ సోషల్ మీడియాలో భర్తతో కలిసి సమాజసేవ మొదలుపెట్టింది సన్నీ లియోన్. మొత్తానికి సన్నీ సామాజిక బాధ్యత చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారంతా.
First published: January 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు