• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • BOLLYWOOD ACTRESS SHILPA SHETTY CHANTS MANTRAS IN HARIDWAR URGE HER FANS TO FALLOW MS GH

Shilpa Shetty: గంగానది ఒడ్డున సాగరకన్య ప్రత్యేక ప్రార్థనలు.. మీరూ ఈ మంత్రాన్ని జపించండి అంటూ..

శిల్పా శెట్టి (Image: Instagram)

Shilpa Shetty: శిల్పా తెల్లటి వస్త్రాలు ధరించి ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. కొంతమంది హిందూ పూజారులతో పాటు చేతులు జోడించి శివున్ని ప్రార్థిస్తూ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ.. ఆ మంత్రానికి గల అర్థాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్ తో పంచుకుంది.

  • News18
  • Last Updated :
  • Share this:
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ తో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంది. తాజాగా తాను హరిద్వార్‌ (haridwar) లోని గంగా (ganga river) ఒడ్డున ప్రార్థనలు చేస్తున్న ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా తన ఫాలోవర్స్ తో పంచుకుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ సాగరకన్యను తెగ మెచ్చుకుంటున్నారు.. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..! శిల్పా తెల్లటి వస్త్రాలు ధరించి ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. కొంతమంది హిందూ పూజారులతో పాటు చేతులు జోడించి శివున్ని ప్రార్థిస్తూ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ.. ఆ మంత్రానికి గల అర్థాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్ తో పంచుకుంది.

తాను పఠించిన మంత్రానికి అర్థాన్ని వివరిస్తూ ‘‘ఈ మంత్రం దీర్ఘాయువుని ఇస్తుంది. విపత్తుల నుంచి మనల్ని దూరం చేస్తుంది. అకాల మరణాన్ని నివారిస్తుంది. అనేక భయాలను కూడా తొలగిస్తుంది. మీ సమస్యలను నయం చేసి మీకు మానసికంగా శక్తిని ఇస్తుంది. యోగా జన్మస్థలమైన హరిద్వారాను సందర్శించినప్పుడు మీరు కూడా ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి. నేను ఎక్కడ ఉన్నప్పటికీ, నాకు ఎన్ని సమస్యల్లో ఉన్నప్పటికీ ఈ మంత్రం జపిస్తాను. దీన్ని జపిస్తే చాలు నాకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ మంత్రానికి అంతటి శక్తి ఉంది. మీ మెరుగైన ఆరోగ్యం, ప్రశాంతత కోసం ఈ మంత్రాన్ని జపించండి.’’ అంటూ తన అభిమానులను, ఫాలోవర్స్ కు సూచించింది శిల్పాశెట్టి.






అంతేకాక, మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే, దయచేసి ప్రతిరోజూ 11 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఆ తర్వత జరిగే అద్భుతాన్ని మీరే చూడండి అంటూ సలహాలిచ్చింది.

హంగామా సీక్వెల్లో నటిస్తున్న సాగర కన్య..

సాగర కన్య శిల్పా శెట్టి తన స్లిమ్ అందాలతో మెస్మరైజ్ సేస్తుంటుంది. ఆమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాని వివాహం చేస్తుకున్నాక సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత నటిగా రీఎంట్రీ ఇస్తోంది. 2003లో విడుదలైన బ్లాక్ బస్టర్ కామెడీడ్రామా 'హంగామా' కి సీక్వెల్ గా రూపొందుతున్న ‘హంగామా 2’ చిత్రంలో నటిస్తోంది. దీనితో పాటు సబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న ‘నికమ్మా’ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ మధ్యే ఘూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. స్వతహాగా యోగా ట్రైనర్ అయిన శిల్పాశెట్టి అప్పుడప్పుడూ తాను యోగా చేస్తున్న ఫోటోలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. అంతేకాదు, తన ఫిటెనెస్ కు యోగానే కారణమని ఎన్నో సార్లు చెప్పింది.
Published by:Srinivas Munigala
First published: