Home /News /movies /

BOLLYWOOD ACTRESS SHABANA AZMISHAH RUKH KHAN BEST WISHES TO PM NARENDRA MODI TO WIN LOK SABHA ELECTIONS 2019 TA

రెండోసారి ప్రధాని భాధ్యతలు స్వీకరించనున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన షారుఖ్ ఖాన్, షబానా అజ్మీ..

ప్రధాన మంత్రికి తిరిగి ఎన్నికైన షారుఖ్,షబానా అజ్మీ

ప్రధాన మంత్రికి తిరిగి ఎన్నికైన షారుఖ్,షబానా అజ్మీ

భారత దేశ రాజకీయాల్లో మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత రెండోసారి పూర్తి మెజారిటీతో గెలుపుపొంది రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు తమ శుభాకాంక్షలు తెలియజేసారు.తాజాగా షారుఖ్,షబానా సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంకా చదవండి ...
  భారత దేశ రాజకీయాల్లో మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత రెండోసారి పూర్తి మెజారిటీతో గెలుపుపొంది రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు తమ శుభాకాంక్షలు తెలియజేసారు. తాజాగా బాలీవుడ్ బాద్‌షా..షారుఖ్ ఖాన్.. పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన నరేంద్రమోదీని అభినందించారు. అంతేకాదు మేం పనిచేసే వారికి పట్టం కడుతూ భారతీయులుగా గర్వపడేలా స్పష్టమైన తీర్పు ఇచ్చాం అన్నాము.  మరోవైపు బాలీవుడ్ నటి షబానా అజ్మీ కూడా రెండోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోదీకి బెస్ట్ విషెస్ అందజేశారు. అంతేకాదు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు అభినందనలు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఐతే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు షబానను ట్రోల్ చేేసారు. చాలా మంది ఆమె పాకిస్తాన్ ఎపుడు వెళతారంటూ అడుగుతున్నారు. మీరు మీ భర్త, కొడుకుతో రాబోయే ఐదేళ్లు ప్రధాని నరేంద్రమోదీయే ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పండి. ఎలక్షన్ సమయంలో కొత్త మంది నటీనటులు ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రావద్దంటూ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే కదా. అందులో షబానా అజ్మీతో పాటు వాళ్లు ఫ్యామిలీ ఉన్నారు. దీంతో నెటిజన్లు ఆమె చేసిన ట్వీట్ ను ట్రోల్ చేసారు.

  First published:

  Tags: Bollywood, Hindi Cinema, Lok sabha election results, Lok Sabha Elections 2019, Narendra modi, Pm modi, Shabana azmi, Shahrukh khan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు