BOLLYWOOD ACTRESS RICHA CHADDA TO PLAY COMMERCIAL SEX WORKER ROLE IN ANUBHAV SINHA FILM BS
వ్యభిచారిణిగా మారుతున్న యంగ్ హీరోయిన్..
ప్రతీకాత్మక చిత్రం
రిచా చద్దా.. బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి. అందం, అభినయంతో రాణిస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్యే సెక్షన్ 375 సినిమాతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. ఇప్పుడు ఓ బోల్డ్ పాత్రలో కనిపించబోతోందట.
రిచా చద్దా.. బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి. అందం, అభినయంతో రాణిస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్యే సెక్షన్ 375 సినిమాతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. ఇప్పుడు ఓ బోల్డ్ పాత్రలో కనిపించబోతోందట.. అనుభవ్ సిన్హా చేస్తున్న అభి తో పార్టీ షురూ హువా హై సినిమాలో కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా నటించబోతోంది. ఈ పాత్రపై రిచా మాట్లాడుతూ.. అది క్రేజీ క్యారెక్టర్ అని, కామెడీతో ముడిపడి ఉన్న ఆ పాత్రను ఎంజాయ్ చేస్తానని వెల్లడించింది. అటు.. అశ్వినీ అయ్యర్ పంగా సినిమాలోనూ ఈ బ్యూటీ నటిస్తోంది. ఇదిలా ఉండగా, ఏ విషయాన్నైనా సూటిగా చెప్పే అలవాటున్న రిచా.. పలువురు జర్నలిస్టులు తనపై రాసిన కథనాలపై స్పందించింది. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న విమర్శలను ఆమె గుర్తు చేసుకున్నారు.
రిచా చద్దా
‘నేను మీడియాతో ఫ్రెండ్లీగా ఉంటాను. అయితే, కొన్ని సార్లు నన్ను దారుణంగా విమర్శించారు. నా ముఖం చెత్తగా ఉందని, సినిమా పరిశ్రమకు పనికిరానని కథనాలు రాశారు.’ అని చెప్పుకొచ్చింది. ఆ కథనాలు తనను మరింత మానసికంగా రాటుదేలేలా చేశాయని, స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, దీప్తి నావల్ లాంటి వాళ్లు తనకు ఆదర్శమని తెలిపింది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.