కేజీఎఫ్ 2లో రవీనా టాండన్... ఆమెనే ఎందుకు ఎంచుకున్నారంటే...

KGF 2 : కన్నడ సినిమా కేజీఎఫ్ సీక్వెల్ షూటింగ్‌కి ముందే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. షూటింగ్‌కి సంబంధించిన ఫీలర్స్ ఆసక్తి రేపుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: March 4, 2019, 10:47 AM IST
కేజీఎఫ్ 2లో రవీనా టాండన్... ఆమెనే ఎందుకు ఎంచుకున్నారంటే...
యాష్, రవీనాటాండన్ (File)
  • Share this:
కన్నడ ఫిల్మ్ KGF బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. యాష్ ప్రధాన పాత్రలో బంగారు గనుల కథాంశంతో రిలీజైన ఈ సినిమా... విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్ మార్క్‌తో సెన్సేషన్ సృష్టించింది. ఐతే... ఫస్ట్ పార్ట్‌లో చాలా మంది నటులు ఎవరో కూడా తెలియదు. అదే తెలిసిన నటులతో సినిమాని నిర్మించి ఉంటే... ఇంకా ఎక్కువ పేరు వచ్చేదన్న ప్రచారం జరిగింది. అందుకే సెకండ్ పార్ట్‌లో ఫేమస్ యాక్టర్లను దించాలని ఫిల్మ్ మేకర్లు ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది. సీక్వెల్‌లో ఇప్పటికే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ఓ ఇంపార్టెంట్ కేరక్టర్ చేస్తున్నట్లు బీ టౌన్ టాక్. ఐతే... సంజయ్ దత్, రవీనా కలిసి నటిస్తారా లేక వేర్వేరు పాత్రలు పోషిస్తారా అన్నది సస్పెన్స్‌గా ఉంది.

KGF, Yash, Sanjay Dutt, Raveena Tandon Prashant Neel, Srinidhi Shetty, KGF 2, కేజీఎఫ్, యాష్, రవీనా టాండన్, కేజీఎఫ్ సీక్వెల్, కేజీఎఫ్ పార్ట్ 2, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి
రవీనా టాండన్, సంజయ్ దత్ (File)


1990లో సంజయ్, రవీనా టాండన్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. మళ్లీ వాళ్లిద్దరూ కలిసి నటిస్తుండటం ఆడియన్స్‌కి థ్రిల్లింగే. త్వరలోనే ఫిల్మ్ షూటింగ్ మొదలవ్వబోతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా సెకండ్ పార్ట్ తెరకెక్కబోతోంది.

మొదటి పార్టు వరకూ కేజీఎఫ్‌లో అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన హీరో... రెండో పార్టులో... ముంబై మాఫియాపై విరుచుకుపడతాడని తెలుస్తోంది. మొదటి పార్టులో రొమాన్స్ టచ్ లేకపోవడంపై ఒకింత అసంతృప్తి ఉండటంతో... రెండో పార్టులో ఆ లోటు పూడ్చేస్తారని తెలిసింది. అందువల్ల సీక్వెల్‌పై భారీ అంచనాలతో ఉన్నారు ప్రేక్షకులు.

 

ఇవి కూడా చదవండి :

ఫోన్ నంబర్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా? సింపుల్ ట్రిక్యూట్యూబ్‌ వీడియోలో కొంత భాగమే డౌన్‌లోడ్ చెయ్యాలా... సింపుల్ ట్రిక్

వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్‌లోడ్ చెయ్యడం ఎలా?

యూట్యూబ్‌ లో సైన్ ఇన్ అవ్వకుండా ఆ వీడియోలు చూడటం ఎలా... ఇలా చెయ్యండి
First published: March 4, 2019, 10:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading