హోమ్ /వార్తలు /సినిమా /

కేజీఎఫ్ 2 షూటింగ్‌లో బాలయ్య భామ..

కేజీఎఫ్ 2 షూటింగ్‌లో బాలయ్య భామ..

నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

కన్నడ ఫిల్మ్ KGF బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. యష్ ప్రధాన పాత్రలో బంగారు గనుల కథాంశంతో రిలీజైన ఈ సినిమా... విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్ మార్క్‌తో సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో బాలయ్య భామ పాల్గొంది.

ఇంకా చదవండి ...

కన్నడ ఫిల్మ్ KGF బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. యష్ ప్రధాన పాత్రలో బంగారు గనుల కథాంశంతో రిలీజైన ఈ సినిమా... విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్ మార్క్‌తో సెన్సేషన్ సృష్టించింది. ఐతే... ఫస్ట్ పార్ట్‌లో చాలా మంది నటులు ఎవరో కూడా తెలియదు. అదే తెలిసిన నటులతో సినిమాని నిర్మించి ఉంటే... ఇంకా ఎక్కువ పేరు వచ్చేదన్న ప్రచారం జరిగింది. అందుకే సెకండ్ పార్ట్‌లో ఫేమస్ యాక్టర్లను దించాలని ఫిల్మ్ మేకర్లు ప్లాన్ చేసారు. సీక్వెల్‌లో ఇప్పటికే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు తాజాగా ఈ సినిమాలో షూటింగ్‌లో రవీనా టాండన్ జాయిన్ అయింది. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ఆమె కేజీఎఫ్ టీమ్‌లోకి స్వాగతం అంటూ వెల్కమ్ చెప్పాడు. ఈ సినిమాలో రవీనా టాండన్.. సంజయ్ దత్‌కు జోడిగా నటిస్తుందా లేదా మరోదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తుందా అనేది చూడాలి.

Bollywood Actress Raveena Tandon joins KGF 2 movie shooting,KGF,KGF 2, Yash, Sanjay Dutt, Raveena Tandon Prashant Neel, Srinidhi Shetty, KGF 2, కేజీఎఫ్, యాష్, రవీనా టాండన్, కేజీఎఫ్ సీక్వెల్, కేజీఎఫ్ పార్ట్ 2, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి
కేజీఎఫ్ షూటింగ్‌లో పాల్గొన్న రవీనా టాండన్ (Twitter/Photo)

1990లో సంజయ్, రవీనా టాండన్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. మళ్లీ వాళ్లిద్దరూ కలిసి నటిస్తుండటం ఆడియన్స్‌కి థ్రిల్లింగే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా సెకండ్ పార్ట్ తెరకెక్కుతోంది. ఇక రవీనా టాండన్ తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగార్జున సరసన ‘ఆకాశవీధిలో’ సినిమాలో యాక్ట్ చేసింది. అంతేకాదు మోహన్ బాబు తన కొడుకులిద్దరితో యాక్ట్ చేసిన ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ముందుగా ప్రకటించిన జూలై 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మొదటి పార్టు వరకూ కేజీఎఫ్‌లో అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన హీరో... రెండో పార్టులో... ముంబై మాఫియాపై విరుచుకుపడతాడని తెలుస్తోంది. మొదటి పార్టులో రొమాన్స్ టచ్ లేకపోవడంపై ఒకింత అసంతృప్తి ఉండటంతో... రెండో పార్టులో ఆ లోటు పూడ్చేస్తారని తెలిసింది. అందువల్ల సీక్వెల్‌పై భారీ అంచనాలతో ఉన్నారు ప్రేక్షకులు.

First published:

Tags: Bollywood, KGF Chapter 2, Prashanth Neel, Raveena Tandon, Sandalwood, Tollywood, Yash

ఉత్తమ కథలు