వారితో ప్రేమలో పడ్డానంటున్న రాధిక ఆప్టే.. టెంప్ట్ అవడం కామన్ అంటున్న బాలయ్య బ్యూటీ

Radhika Apte: ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? అని అడగ్గా.. షూటింగ్ సమయాల్లో తనకు ఎంతో మంది ఎదురయ్యారని, వారిలో చాలా మంది ఆకర్షించారని, కొందరు తన మనసుకు దగ్గరయ్యారని చెప్పుకొచ్చింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 1, 2019, 1:00 PM IST
వారితో ప్రేమలో పడ్డానంటున్న రాధిక ఆప్టే.. టెంప్ట్ అవడం కామన్ అంటున్న బాలయ్య బ్యూటీ
బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 1, 2019, 1:00 PM IST
రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి.. రాధిక ఆప్టే. సినిమాల కంటే బోల్డ్ కామెంట్లతో మత్తెక్కిస్తూ వార్తల్లో నిలుస్తుందీ భామ. తాజాగా, ఓ సెన్సేషనల్ కామెంట్ చేసి మరోసారి అభిమానులను షాక్‌కు గురిచేసింది. నేహ ధుపియా హోస్ట్‌గా చేస్తున్న ఓ కార్యక్రమానికి హాజరైన ఈ బ్యూటీ.. పలు ప్రశ్నలకు హాట్ హాట్‌గా తనదైన శైలిలో జవాబిచ్చింది. ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? అని అడగ్గా.. షూటింగ్ సమయాల్లో తనకు ఎంతో మంది ఎదురయ్యారని, వారిలో చాలా మంది ఆకర్షించారని, కొందరు తన మనసుకు దగ్గరయ్యారని చెప్పుకొచ్చింది. వారితో ప్రేమలో పడ్డానని, అయితే అది ఓ పరిధి వరకేనని తెలిపింది.

ఇక, రొమాంటిక్ సన్నివేశాలు చేసేప్పుడు టెంప్ట్ అయ్యారా? ఫీలింగ్స్ కలిగాయా? అని ప్రశ్నించగా.. అది కామనే! అంటూ సమాధానమిచ్చింది. ‘నా కెరీర్‌లో అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. రొమాంటిక్ సన్నివేశాలు చేసేప్పుడు ఆ ఫీలింగ్స్ వస్తేనే సన్నివేశం సహజంగా వస్తుంది. ఎలాంటి ఫీలింగ్ లేకుండా నటించడం సాధ్యం కాదు’ అని ఆప్టే వెల్లడించింది. ఇక, బెనెడిక్ట్ టేలర్ తనకు భర్తగా దొరకడం నిజంగా తన అదృష్టమని పేర్కొంది.

First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...