బాలీవుడ్ యాక్టరస్, మోడల్, టీవీ ఆర్టిస్ట్ నియాశర్మ (Niasharmas)మరోసారి రచ్చ చేసింది. సోషల్ మీడియా(Social media)లో ఎప్పుడూ తన డ్యాన్స్, హాట్ హాట్ ఫోటోస్‌తో హీటెక్కించే ముంబై లేడీ మరోసారి సారేగామ (Saregamapa)డ్యాన్స్ ఈవెంట్ గ్రాండ్ ఫినాలే (Grand finale)ప్రోగ్రామ్ రిహాల్సస్‌కి అటెండ్ అయింది. ముంబైలోని సావన్ డ్యాన్స్ స్టూడియో(Sawan dance studio)లో నియాశర్మ చేసిన హల్‌చల్ అంతా ఇంతా కాదు. పసుపు రంగు టాప్ బ్లూ, బ్లాక్ మిక్స్ కలర్‌లో ఉన్న ప్యాంట్‌పైన నిక్కరు ఉంటే ట్రాక్ డ్రెస్‌తో వచ్చి అందర్ని సర్‌ప్రైజ్ చేసింది. సావన్ స్టూడియోలో జరిగిన ఈ రిహాల్సస్‌కి నియాశర్మ(Niasharma)చోళికే పిచే క్యా హై (Choli ke peeche kya hai)సాంగ్‌కి స్టెప్పులు వేసింది. గతంలో ఖల్‌నాయక్ సినిమాలో మాధురిదీక్షిత్ ఐటమ్ సాంగ్ చేసిన ఈ పాటకు నియాశర్మ రెచ్చిపోయి స్టెప్పులేసింది. ఆ డ్యాన్స్ మూమెంట్‌కి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. మంచి మాస్ సాంగ్‌కి నియాశర్మ లాంటి హాట్ బ్యూటీ స్టెప్పులు వేసి ఇరగదీయడంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇప్పటికే లక్ష 80వేల లైక్‌లు వచ్చాయి. నియాశర్మ సారేగామ గ్రాండ్ ఫినాలే కోసం గత రెండ్రోజులుగా డ్యాన్స్ స్టూడియోలోనే ప్రాక్టీస్ చేస్తున్నానని..ఈవెంట్ ఎంత సూపర్‌గా ఉంటుందో చెప్పలేనంటూ తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంది.
చోళీకే పిచే క్యా హై అంటున్న నియాశర్మ..
నియాశర్మ ఆ మధ్య తన ఐటమ్ సాంగ్ ఫూంక్‌లే ప్రమోషన్ కోసం ముంబైలో రోడ్డుపై ఆటో డ్రైవర్స్‌తో స్టెప్పులేసి ట్రోల్ అయింది. నియాశర్మ చేసిన ప్రమోషన్ అగ్లీ టర్న్ తీసుకుంది. ఓ యాక్టరస్ రోడ్డుపై డ్యాన్స్ చేయడం ఏమిటంటూ గతంలో ఇలాగే రెచ్చిపోయిన కొందరు బోల్డ్ బ్యూటీలతో పోలుస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram
ఇన్‌స్టాలో రచ్చ చేస్తున్న ఐటమ్ సాంగ్..
నియాశర్మను ఆ టైమ్‌లో రాఖీసావంత్, ఉర్ఫిజావేద్‌తో పోల్చిన నెటిజన్లు..ఇప్పుడు చోళీకే పిచే క్యా హై సాంగ్ డ్యాన్స్ చూసి ఫిదా అవుతున్నారు. తనకు కావాల్సిన పబ్లిసిటీ కోసం కాస్త అందాల్ని ఆరబోసి ఆడియన్స్‌ను తనవైపు తిప్పుకునే నియాశర్మ సారెగామ గ్రాండ్ ఫినాలే ప్రోగ్రామ్‌లో ఎంత చమట దారిపోసిందోనంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. కొందరైతే లైక్ సింబల్స్ పోస్ట్ చేస్తూ సూపర్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nia sharma photoshoot