హోమ్ /వార్తలు /సినిమా /

Nia Sharma: అసలు ఆ ఆర్టిస్టులను రెండోసారి చూడగలమా.. షాకింగ్ కామెంట్స్ చేసిన నియా శర్మ!

Nia Sharma: అసలు ఆ ఆర్టిస్టులను రెండోసారి చూడగలమా.. షాకింగ్ కామెంట్స్ చేసిన నియా శర్మ!

Nia Sharma

Nia Sharma

Nia Sharma: ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఒక స్టార్ హోదాను సంపాదించుకున్నాక వాళ్ళల్లో ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి. ఓపెన్ గా చెప్పాలంటే వాళ్లకు ఒక పొగరు అనేది వచ్చేస్తుంది. దాంతో తమ కింద నటించే నటీనటులను బాగా చులకనగా చూస్తూ ఉంటారు.

ఇంకా చదవండి ...

Nia Sharma: ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఒక స్టార్ హోదాను సంపాదించుకున్నాక వాళ్ళల్లో ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి. ఓపెన్ గా చెప్పాలంటే వాళ్లకు ఒక పొగరు అనేది వచ్చేస్తుంది. దాంతో తమ కింద నటించే నటీనటులను బాగా చులకనగా చూస్తూ ఉంటారు. తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఇలా ఉంటే తాజాగా ఓ నటి కూడా స్టార్ కిడ్స్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన నటి నియా శర్మ. బుల్లితెరపై నటించిన ఈమె గురించి బాలీవుడ్ ప్రేక్షకులందరికీ పరిచయమే. తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈమె చాలా వరకు బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది. ఈమె చూడటానికి హాట్ హాట్ గా కనిపించడమే కాకుండా ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన ఫాలోవర్స్ తో బాగా పంచుకుంటుంది. ఇక ఈమె నెటిజన్ల నుండి బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది. అంతేకాకుండా నెగటివ్ కామెంట్స్ కూడా బాగా ఎదురవుతాయి.

ఇది కూడా చదవండి:కొరటాల శివకు కూడా అదే సమస్య.. మూడేళ్ల నుంచి ఒకే సినిమా అవ్వడంతో ఈ సమస్య?

ఈమె ఎంతోమందిని ఉద్దేశించి చాలాసార్లు విమర్శలు చేసింది. దీంతో ఆమెను ఎంతో మంది నెటిజన్లు తిట్టిపోశారు. ఇదిలా ఉంటే తాజాగా కొందరి బాలీవుడ్ స్టార్ కిడ్స్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. వాళ్లు తన తల్లి తండ్రుల పేర్లు చెప్పకుండా ఉంటే వారిని ఇండస్ట్రీలో రెండోసారి ఎవరైనా చూస్తారా అంటూ వెటకారంగా విమర్శించింది. కొందరు తనను బాలీవుడ్ ఇండస్ట్రీలో చూడొద్దని అనుకుంటున్నారని.. అందుకు తనను అందంగా లేదని, బాడీ షేప్ సరిగాలేదని అంటున్నారని తెలిపింది.

ఇది కూడా చదవండి: మాట కటువు కానీ మనసు వెన్న.. క్యాన్సర్ పేషెంట్‌కు పారితోషికం దానం చేసిన అర్ధపావు భాగ్యం

ఇక తనపై విమర్శలు చేసిన వాళ్లు ఒక్కసారి ఆ స్టార్ కిడ్స్ ముఖాలను చూసి మాట్లాడితే బాగుంటుందని వెటకారంగా స్పందించింది. వారిని నిజంగా చూడగలరా అంటూ నేరుగా ప్రశ్నించింది. వారి అందరి ముందు తానే 100% బెటర్ అని తెలిపింది. స్టార్ కిడ్స్ వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలను చేస్తూ ఉంటారు కానీ అవుట్ సైడ్ వాళ్లకు మాత్రం అంత అవకాశం ఉండదని తెలిపింది. దీంతో ఈమె చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. నియా శర్మకు పొగరు మామూలుగా లేదు కదా అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. సొంత టాలెంట్ తో వచ్చిన వాళ్ల గురించి విమర్శలు చేయడం సరైనది కాదని ఎవరైనా అనేటప్పుడు ముందుగా నువ్వేంటో నిరూపించుకో అంటూ ఆమెను విమర్శిస్తున్నారు.

First published:

Tags: Alia bhat, Bollywood, Neha Sharma, Nia Sharma

ఉత్తమ కథలు