• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD ACTRESS MOUNI ROY TRIES BELLY DANCE TO JUSTIN BIEBERS YUMMY SONG VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA MS

Mouni Roy: నడుమును బొంగరంలా తిప్పుతూ.. బెల్లీ డాన్స్ తో ఇరగదీసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ

Mouni Roy: నడుమును బొంగరంలా తిప్పుతూ.. బెల్లీ డాన్స్ తో ఇరగదీసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ

మౌని రాయ్ (ఫైల్)

Mouni Roy - Justin bieber: నటిగానే గాక.. అద్భుతమైన డాన్సర్ గా మౌని రాయ్ కు పేరుంది. ఇక తాజాగా ఈ భామ ఈ ముద్దుగుమ్మ కెనడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ సాంగ్ కు చిందేసింది. వదులైన దుస్తులతో.. బెల్లీ డాన్స్ తో అదరగొట్టింది.

  • News18
  • Last Updated:
  • Share this:
    Mouni Roy - Justin bieber: సోషల్ మీడియాలో యక్టివ్ గా ఉండే బాలీవుడ్ నటీమణుల్లో మౌని రాయ్ ఒకరు. బుల్లితెర నుంచి వెండితెర మీదకు వచ్చిన ఈ హాట్ బ్యూటీ పలు సినిమాల్లో తన నటనతో అదరగొట్టింది. నాగిన్ సీరియల్ తో టెలివిజన్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తుమ్ బిన్ 2, గోల్డ్ చిత్రాల్లో మెప్పించింది. ఆ తర్వాత కేజీఎప్ చాప్టర్-1 లో చేసిన ఐటెం సాంగ్ కు మౌనికి మంచి పేరొచ్చింది. నటిగానే గాక.. అద్భుతమైన డాన్సర్ గా మౌని రాయ్ కు పేరుంది. ఇక తాజాగా ఈ భామ ఈ ముద్దుగుమ్మ కెనడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ సాంగ్ కు చిందేసింది. వదులైన దుస్తులతో.. బెల్లీ డాన్స్ తో అదరగొట్టింది.

    పాప్ సింగర్ జస్టిన్ బీబర్ పాడిన యమ్మీ (Yummy) పాట ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటకు మౌని రాయ్ చేసిన డాన్స్ అదరహో అనేలా ఉంది. ఇటీవలే మౌని రాయ్ ఈ పాటకు చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పైన బ్లాక్ కలర్ లూజ్ టాప్ తో.. ఈ అమ్మడు చేసిన డాన్స్ చూసి తీరాల్సిందే. మత్తెక్కించే చూపులతో అభిమానులు కవ్విస్తూ... అసలు ఉందా లేదా అన్నట్టు ఉండే నడుమును బొంగరంలా తిప్పుతూ అభిమానులను కట్టిపడేసింది మౌని రాయ్.










    View this post on Instagram






    A post shared by mon (@imouniroy)






    పోతపోసిన శిల్పంలా ఉండే మౌని రాయ్... నడుమును బొంగరంలా తిప్పుతున్న వీడియోను షేర్ చేస్తూ.. తాను ప్రముఖ కొరియోగ్రాఫర్ షాజియా సామ్జీ (shazia samji) లా ట్రై చేశానని చెప్పుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఈ వీడయోను పోస్ట్ చేసింది మౌని రాయ్.

    ఇక పోస్టును వీక్షించిన ఆమె అభిమానులు.. మౌని డాన్స్ ఇరగదీసిందని అంటున్నారు. షాజియా సామ్జీ కూడా ఈ వీడియోపై కామెంట్ చేశారు. వీడియో చాలా హాట్ గా ఉందని షాజియా కామెంట్ పెట్టడం గమనార్హం. ఇక మౌని అభిమానులైతే.. ఈ వీడియోను చూసి ఫిదా అవుతున్నారు.










    View this post on Instagram






    A post shared by mon (@imouniroy)






    ఈ వీడియోకంటే ముందు ఆమె సెలెనా గొమెజ్ (selena gomez) పాడిన ‘లవ్ యు లైక్ ఎ లవ్ సాంగ్..’ పాటకు కూడా డాన్స్ చేసింది. ఈ వీడియో కూడా నెట్టింట అభిమానులను ఆకట్టుకుంటున్నది.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు