Mouni Roy:11వ అంతస్తు నుంచి హీరోయిన్ కారుపై పడ్డ పెద్ద బండరాయి..

మౌనీ రాయ్ (Twitter/Photo)

Mouni Roy: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడింది. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Mouni Roy: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడింది. వివరాల్లోకి వెళితే.. ముంబాయిలోని మెట్రో రైల్ పనులు జరుగుతున్న దగ్గర ఆమె కారు ఆగింది. ఇంతలోనే మౌనీ రాయ్ కారుపై ఒక పెద్ద బండరాయి పడింది. 11 అంతస్థుల పై నుంచి రాయి పడటంతో ఆమె కారు పై భాగంలోని అద్దం పగిలిపోయింది. ఆ సమయంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని మౌని రాయ్ తెలిపింది. రాయి తన కారుపై పడటం వల్ల కారు పై భాగం డ్యామేజ్ అయిన దృష్యాలను మౌనీ రాయ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.



    ఈ సందర్భంగా  మౌనీ రాయ్ మాట్లాడుతూ.. షూటింగ్ నిమిత్తం ఎప్పటిలాగే తన కారులో జుహు వైపు వెళుతుండగా.. రెడ్ సిగ్నల్ పడటంతో కారును ఆపాను. ఇంతలోనే ఉరుములేని పిడుగులా  ఉన్నట్టుండి ఓ పెద్ద బండరాయి  తన కారుపై పడిందన్నారు. ఒక వేళ ఆ బండరాయి తన కారుపై కాకుండా.. ఎవరిపైనా పడుంటే పరిస్థితి ఏంటి అని వాపోయింది. ముంబాయిలో మెట్రో పనులు ఎంత బాధ్యత లేకుండా కొనసాగుతున్నాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం అని మౌనీ రాయ్ ట్వీట్ చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: