Mandana Karimi: బట్టలు మార్చుకుంటుంటే క్యారీవాన్‌లోకి వచ్చి అసభ్యంగా.. ఆ నిర్మాతపై నటి సంచలనం..

మందన కరిమి (Mandana Karimi)

Mandana Karimi: సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎందరో హీరోయిన్లు ఈ పాటికే దీనిపై నోరు విప్పారు. కొందరు బహిరంగంగా తమకు జరిగిన చేదు అనుభవాల..

  • Share this:
సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎందరో హీరోయిన్లు ఈ పాటికే దీనిపై నోరు విప్పారు. కొందరు బహిరంగంగా తమకు జరిగిన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. కొందరు మనసులోనే దాచుకున్నారు. అప్పట్లో దీనిపై మీటూ అనే పెద్ద ఉద్యమం కూడా జరిగింది. అందులో చాలా మంది ముందుకొచ్చారు. తెలుగులో అయితే శ్రీ రెడ్డి అలాగే పాపులర్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా దీనిపై సంచలన కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలో తనతో నిర్మాత అసభ్యంగా ప్రవర్తించాడంటూ చెప్పుకొచ్చింది. లొకేషన్‌లో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఆ భామే మందనా కరిమి. తనపై ఓ నిర్మాత ప్రవర్తించిన తీరు బాధ పెట్టిందని తెలిపింది ఈమె. అతడు తనను మానసికంగా వేధించాడని చెబుతూ కన్నీరు పెట్టుకుంది మందన. అసలు విషయం ఏంటేంటే సెక్సీ బాంబ్ సన్నీ లియోన్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘కోకో కోలా’ సినిమాలో మందనా కరిమి కూడా నటిస్తుంది.
mandana karimi,mandana karimi twitter,mandana karimi bikini,mandana karimi hot songs,mandana karimi film cocacola,mandana karimi controversy,mandana karimi news,mandana karimi sexual assault,mandana karimi harrassed,mandana karimi kya kool hain hum,mandana karimi physical harrassment,mandana karimi sexually harassed,mandana karimi vs mahendra dhariwal,మందన కరిమి,మందన కరిమి క్యాస్టింగ్ కౌచ్,మందన కరిమి కోకో కోలా సినిమా
మందన కరిమి (Mandana Karimi)

ఈ సినిమా నిర్మాత మహేంద్ర ధరివాల్‌ తనను మానసిక వేధింపులకు గురిచేశాడని ఆమె చెప్పడం సంచలనంగా మారుతుందిప్పుడు. 2019లోనే కోకో కోలా షూటింగ్ జరుగుతుందని.. మధ్యలో కొన్ని రోజులు కరోనా కారణంగా ఆగిపోయిందని చెప్పుకొచ్చింది ఈమె. అయితే ఈ చిత్ర నిర్మాత సహా యూనిట్ మొత్తం కూడా తనను చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పుకొచ్చింది మందన. కాల్ షీట్స్ ప్రకారం అయితే దీవాళి ముందు రోజు కోకో కోలా సినిమాకు ప్యాకప్ చెప్పాలి. అక్కడి వరకే డేట్స్ తీసుకున్నారని.. కానీ ఈ సినిమాకి సంబంధించి తన షూటింగ్‌ చివరి రోజు అని తెలిసినా కూడా నిర్మాత తనతో అసభ్యంగా ప్రవర్తించాడని గుర్తు చేసుకుంది.
mandana karimi,mandana karimi twitter,mandana karimi bikini,mandana karimi hot songs,mandana karimi film cocacola,mandana karimi controversy,mandana karimi news,mandana karimi sexual assault,mandana karimi harrassed,mandana karimi kya kool hain hum,mandana karimi physical harrassment,mandana karimi sexually harassed,mandana karimi vs mahendra dhariwal,మందన కరిమి,మందన కరిమి క్యాస్టింగ్ కౌచ్,మందన కరిమి కోకో కోలా సినిమా
మందన కరిమి (Mandana Karimi)

అన్నీ పూర్తైన తర్వాత కూడా మరో గంట సేపు ఉండాలని.. అదనపు ప్యాచప్ పనులు ఉన్నాయని చెప్పి ఆపేసాడని చెప్పింది. తను బట్టలు మార్చుకుంటుంటే క్యారీవాన్‌లోకి కూడా వచ్చేసాడని.. అక్కడ తనతో నిర్మాత మహేంద్ర ధరివాల్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. తనకు వేరే మీటింగ్స్ ఉండటంతో కుదరదని చెప్పి క్యారీవాన్‌లోకి వచ్చి డ్రెస్ మార్చుకుంటున్న తనతో అనరాని మాటలు అన్నాడని ఆరోపించింది. బట్టలేసుకొచ్చి బయట మాట్లాడతానని చెప్పినా కూడా వినకుండా దూషించాడని చెప్పుకొచ్చింది మందన కరిమి. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలు బి టౌన్‌లో సంచలనం రేపుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: