Gehana Vasisth - RajKundra - Sherlyn Chopra: రాజ్ కుంద్రాకు ఈ గతి పట్టడానికి కారణం షెర్లినే కారణం.. నటి కామెంట్స్ వైరల్

Gehana Vasisth - RajKundra - Sherlyn Chopra

Gehana Vasisth - RajKundra - Sherlyn Chopra: గత కొన్ని రోజుల నుండి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రా పేరు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈయన కొన్ని రోజుల కిందట నీలి చిత్రీకరణ వ్యవహారంలో దొరికిపోవడంతో అతడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Share this:
    Gehana Vasisth - RajKundra - Sherlyn Chopra: గత కొన్ని రోజుల నుండి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రా పేరు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈయన కొన్ని రోజుల కిందట నీలి చిత్రీకరణ వ్యవహారంలో దొరికిపోవడంతో అతడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇటీవలే బెయిల్ ద్వారా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఇతడికి ఈ గతి పట్టడానికి కారణం షెర్లిన్ అని మరో నటి కొన్ని వ్యాఖ్యలు చేసింది.

    రాజ్ కుంద్రా కొన్ని రోజుల కిందట నీలి చిత్రాలను చిత్రీకరించి వాటిని ఆన్ లైన్ లో పబ్లిష్ చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా కొందరి అమాయకులను బలవంతంగా అందులోకి దింపినట్లు కూడా తెలిసిందే. ఇక వీటి కోసం పలు యాప్ లు కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు రాజ్ కుంద్రా. అలా ఇతడితో పాటు మరి కొంత మంది పేర్లు కూడా బయట పడగా అందులో మరో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా పేరు కూడా బయట పడింది.

    ఇక ఆమెను పోలీసులు విచారించగా.. అతడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. తనను ఓసారి ఓ గదిలో బంధించేందుకు ప్రయత్నించాడని.. అక్కడి నుంచి తప్పించుకున్నానని గతంలో తెలిపింది. ఇక ఇటీవలే ఇతడికి బెయిల్ కూడా అందింది. మళ్లీ తాజాగా ఈ విషయం గురించి నటి గెహనా వశిష్ట్ కొన్ని విషయాలు పంచుకుంది. తనకు కూడా రాజ్ కుంద్రా తో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో తనను కూడా అరెస్టు చేశారు.

    ఇది కూడా చదవండి:నువ్వు మాత్రమే ఎందుకు ఇలా ఉన్నావ్.. నెటిజెన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సమీరారెడ్డి

    ఈమె కూడా 133 రోజులు కస్టడీలో ఉండగా బెయిల్ ద్వారా ఇటీవలే బయటికి వచ్చింది. ఇక తాజాగా శిల్పా, రాజ్ కుంద్రా గురించి మద్దతుగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. షెర్లిన్ చోప్రా.. మీడియా దృష్టిలో పడటానికి, నిత్యం వార్తల్లో నిలవడానికి శిల్ప శెట్టి దంపతుల పరువు కి భంగం కలిగించే విధంగా మాట్లాడుతుంది అని తెలిపింది.

    ఇది కూడా చదవండి:వాళ్ళకి అంతా నచ్చితే ఆ అబ్బాయిని దత్తత తెచ్చుకోమనండి.. సింగర్ చిన్మయ్ ఘాటు వ్యాఖ్యలు

    అసలు రాజ్ కుంద్రాను ఇటువంటి వ్యవహారంలో తోసిపుచ్చింది షెర్లినే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. రాజ్ కుంద్రా జైలు నుంచి వచ్చాక ఆమెను పట్టించుకోవడం లేదు అన్నట్లుగా ఇటువంటి ఆరోపణలు చేస్తుందని తెలిపింది గెహనా. ఇక షెర్లిన్ కు కోటి రూపాయలు సంపాదించడానికి కుంద్రా ఎంతో సహాయపడ్డాడని.. అతడు క్రియేట్ చేసినా ఆర్మ్ స్పైమ్ యాప్ ద్వారా ఆమె ఈ స్థాయికి వచ్చిందని.. అందుకు ఆమె కుంద్రా కు రుణపడి ఉండాలి అంటూ వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఆమె వల్లే అతడికి ఈ గతి పట్టింది అని తెలిపింది.
    Published by:Navya Reddy
    First published: