Video: లైవ్‌లో నగ్నంగా నటి.. ఎలా ఉన్నానో చెప్పమన్న గెహన వశిష్ట్‌

గెహనా వశిష్ట్ (File Image credit - instagram)

Gehana Vasisth: ఈ మధ్య నగ్నంగా కనిపించడం అనేది కొంత మంది నటీమణులకు ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా వివాదాల్లో చిక్కుకున్న వారు బట్టలిప్పేసి... ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపిస్తున్నారు. మరి గెహన వశిష్ట్ ఎందుకలా చేసింది?

  • Share this:
    Gehana Vasisth: రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద నటి గెహన వశిస్ట్ మరో షాక్ ఇచ్చింది. ఆమెపై ముంబైలోని మల్వానీ పోలీస్ స్టేషన్‌లో FIR రిజిస్టర్ అయ్యాక... అనూహ్యంగా ఈమె ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ప్రత్యక్షమైంది. ఒంటిపై నూలుపోగు లేకుండా పూర్తిగా నగ్నంగా లైవ్‌లోకి వచ్చిన గెహన వశిష్ట్... అదే విషయాన్ని తన ఫాలోయర్లకు చెప్పింది. ఇలా ఆమె ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో నగ్నంగా కనిపించడానికి ఓ కారణం ఉంది. ఆమె న్యూడ్‌గా కనిపించినప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంది. అందంగా ఉందో లేక అసభ్యం (vulgar)గా ఉందో తెలుసుకోవాలి అనుకుంది. అందుకు ఈ మార్గం ఎంచుకుంది.

    లైవ్ సెషన్‌లో గెహనా వశిస్ట్ ఏమందంటే "ఫ్రెండ్స్... నేను మీ ముందు లైవ్‌లో నగ్నంగా ఉన్నాను. చెప్పండి... నేను ఎలా కనిపిస్తున్నాను. అసభ్యంగా ఉన్నానా... చీప్‌గా కనిపిస్తున్నానా... లేక నేను ఎక్కడైనా పోర్నోగ్రఫీ చేసినట్లు కనిపిస్తున్నానా... నా చర్యలు ఏవైనా నేను పోర్న్ చేస్తున్నట్లు మీకు అనిపిస్తున్నాయా... చెప్పండి నాకు... నమ్మండి... ఇప్పుడు నేను ఏదీ తొడుక్కోలేదు. అందుకే మళ్లీ చెబుతున్నా... నేను ఏదీ తొడుక్కోలేదు. కానీ మీరు ఇప్పుడు నన్ను పోర్న్ కేటగిరీ కింద లెక్కించట్లేదు. అలా మీకు అనిపించట్లేదు. నా మిగతా వీడియోల్లో నేను మంచి బట్టలు వేసుకున్నాను. కానీ వాటిని పోర్న్ అంటున్నారు. ఇది తప్పుగా అనిపించట్లేదా? అందరూ నేను పోర్న్‌గా కనిపించానని అంటున్నారు. ఇప్పుడు నేను ఏదీ తొడుక్కోలేదుగా... కానీ మీకు ఇది పోర్న్‌లా అనిపించట్లేదుగా... కపటత్వాని(hypocrisy)కీ ఓ పరిమితి ఉంది " అని చెప్పింది.




    మాల్వానీ పోలీసులు గెహన వశిష్ట్‌కి వ్యతిరేకంగా FIR నమోదుచేసినప్పుడు... ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో "నేను రాజ్ కుంద్రాకు సపోర్ట్ చెయ్యట్లేదు. నాకు వ్యతిరేకంగా ఓ కేసు నమోదైంది. నన్ను కావాలని ఇందులో ఇరికించారు. నా పేరును కుట్రపూరితంగా FIRలో చేర్చారు. 5 నెలల కిందటే ఇలా ఎందుకు అనలేదు. అప్పుడు నన్ను క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసినప్పుడు... ఇలా నన్ను అనలేదే" అని ఆమె ప్రశ్నించారు.

    ఇది కూడా చదవండి: Video: రూప.. వంటలు వండుతుంది.. అందాలు వడ్డిస్తుంది!

    రాజ్‌కుంద్రా కంపెనీలో గెహన మూడు పోర్నోగ్రఫీ చిత్రాల్లో నటించినట్లు ఆరోపణలున్నాయి. పోర్నోగ్రఫీ కేసులో ఫిబ్రవరిలోనే నటి గెహన వశిష్ట్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు ఆమె పోలీసులకు రూ.15 లక్షలు లంచంగా ఇచ్చేందుకు సిద్ధమైందని తాజాగా ఆరోపణలు వచ్చాయి. అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసులతో గెహన.. "నన్ను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు మీకెంత కావాలో చెప్పండి" అని బేరం పెట్టినట్లు తెలిసింది. దీనిపై తాజాగా స్పందించిన ఆమె... పోలీసులే తననుంచి లంచం డిమాండ్ చేశారని ఆరోపించింది.
    Published by:Krishna Kumar N
    First published: