బాల నటిగా సినీ రంగంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత దక్షిణాదిలో హీరోయిన్‌గా అడుగులు వేసి.. ఆపై బాలీవుడ్ తెరపై తన అందం అభినయంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి. వెండితెరపై ఎంతో మంది హీరోయిన్స్ వచ్చినా.. అతిలోకసుందరి అంటే అందరి మదిలో మెదిలే రూపం శ్రీదేవిదే. ఆమె మన నుంచి దూరమై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ నటిగా చెరగని ముద్ర వేసింది శ్రీదేవి. తాజాగా ఆమె జీవితంపై రాసిన పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేసారు. ప్రముఖ రచయత సత్యార్ధ్ నాయక్.. ‘శ్రీదేవి: ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’ పేరుతో ఈ పుస్తకాన్ని రాసారు. ఈ పుస్తకంలో ముందుమాటను బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ రాసారు. ఆమె మాట్లాడుతూ.. ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్‌స్టూట్ అని కొనయాడింది.
ఈ పుస్తకాన్ని మరో కథానాయిక దీపికా పదుకొణే విడుదల చేవారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్ హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.