news18-telugu
Updated: January 14, 2021, 10:30 PM IST
ప్రభాస్,దీపికా పదుకొణే (File/Photo)
Prabhas- Deepika Padukone: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా ఖరారైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా గతేడాదే వచ్చేసింది. ఈ మూవీ షూటింగ్‌ని ఈ ఏడాది ప్రారంభిస్తానని నాగ్ అశ్విన్ కూడా వెల్లడించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్‌కి దీపికా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్‌ని మార్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల టాక్ ప్రకారం.. ఈ మూవీ షూటింగ్ మరింత వాయిదా పడ్డట్లు సమాచారం. ప్రభాస్ మూవీకి ఓకే చెప్పిన దీపికా.. ఇటీవల హృతిక్ ఫైటర్ చిత్రానికి కూడా ఒప్పుకుంది. ఈ ఏడాది వేసవి కాలం నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి దీపికా డేట్లను ఇచ్చేసిందట.
ఈ క్రమంలో ప్రభాస్ మూవీకి ఇబ్బంది అవ్వనుందట. అయితే ఈ పాత్రకు దీపికా తప్ప మరెవరూ న్యాయం చేయలేరని బలంగా నమ్ముతున్న నాగ్ అశ్విన్.. ఆమె కోసం వెయిట్ చేస్తానని చెప్పారట. ఈ ఏడాది చివరికైనా డేట్లను అడ్జెస్ట్ చేయమని చెప్పాడట. అందుకు దీపికా ఓకే చెప్పినట్లు టాక్. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్ మరిన్ని రోజులు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.
కాగా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ మూవీతో పాటు ప్రభాస్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌లో.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌లో నటించనున్నారు.
Published by:
Manjula S
First published:
January 14, 2021, 9:51 PM IST