BOLLYWOOD ACTRESS ANUSHKA SHARMA REMEMBERS HER COLLEGE DAYS NR
Anushka Sharma: అలా మాత్రమే ఉన్నావు.. అందంగా లేవంటూ అనుష్క శర్మపై షాకింగ్ కామెంట్స్!
Anushka sharma
Anushka Sharma: సినీ ఇండస్ట్రీలో నటీనటులు తమ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో వాళ్లు ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలు..
Anushka Sharma: సినీ ఇండస్ట్రీలో నటీనటులు తమ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో వాళ్లు ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలు.. కొన్ని సందర్భాలలో బయట పెడుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవంతో వేదిక వెనక్కి వెళ్లి ఏడ్చానంటున్న బాలీవుడ్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో కాదు..
ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రముఖ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క. చిన్న వయసులోనే వెండితెరకు పరిచయమైన అనుష్క.. మే 1న తన 33 వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది. ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అనుష్క ఇటీవలే పండంటి బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
షారుక్ ఖాన్ సరసన నటించిన సినిమాలో తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయమయింది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే తను చదువుకునే సమయంలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాల గురించి తెలిపింది. తను కాలేజ్ లో ఉన్నప్పుడు మోడలింగ్ పై ఆసక్తి ఉండేదట. తనని కాలేజ్ లో ఏమంత అందంగా ఉండవని, కేవలం సన్నగా, నాజుగ్గా ఉండటం తప్ప.. గ్లామర్ గా ఉండవని కామెంట్స్ చేసేవారట.
ఆ మాటలకు చాలా సార్లు బాధపడ్డాను అంటూ తెలిపిన అనుష్క.. తన నటించిన 'రబ్ నే బనాదీ జోడీ' సినిమా తర్వాత తను చాలా బాధపడిన విషయాన్ని తెలిపింది. ఫిలింఫేర్ అవార్డ్ సమయంలో తను నటించిన మొదటి సినిమా కు ఉత్తమ నూతన నటి ఫిలిం ఫేర్ అవార్డు దక్కుతుందని ఆ వేడుకకు వెళ్లిందట. కానీ తనకు అవార్డు రాకపోయేసరికి.. ఆ సమయంలో వేదిక వెనక్కి వెళ్లి ఏడ్చిందట. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ తన వెనుక నుండి వచ్చి తను నటించిన సినిమాను చూశాను అంటూ.. అందులో తన నటన బాగుందని చెప్పడంతో.. తను చెప్పిన మాటలే తనకు పెద్ద అవార్డు అని భావించిందట అనుష్క.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.