షాకింగ్.. 23 గంటలు నాన్‌స్టాప్ అదే పని చేసిన ఆ హీరోయిన్..

Ananya Pandey: గతేడాది 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాతో హిందీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ అనన్య పాండే. ఏడాది కాలంగా బాలీవుడ్‌లో ఈమె పేరు బాగానే వినిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 16, 2020, 8:52 AM IST
షాకింగ్.. 23 గంటలు నాన్‌స్టాప్ అదే పని చేసిన ఆ హీరోయిన్..
అనన్య పాండే (Ananya Pandey 23 hours shooting)
  • Share this:
కొందరు హీరోయిన్లు ఉంటారు.. వాళ్లకు పని పని తప్ప మరోటి తెలియదు. అయినా ఇప్పుడున్న పోటీలో 24 గంటలు కష్టపడినా కూడా మహా అయితే రెండు మూడేళ్ల కంటే ఎక్కువగా ఉండటం లేదు హీరోయిన్లు. దాంతో దొరికిన ఛాన్సులను కళ్లకు అద్దుకుని తీసుకుంటున్నారు. దానికోసమే కష్టపడుతున్నారు.. ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఇదే చేసింది. గతేడాది 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాతో హిందీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ అనన్య పాండే. ఏడాది కాలంగా బాలీవుడ్‌లో ఈమె పేరు బాగానే వినిపిస్తుంది. అందాల ఆరబోతకు తోడు మంచి అభినయం కూడా ఈమె సొంతం. ప్రముఖ బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురు ఈమె.

అనన్య పాండే (Ananya Pandey 23 hours shooting)
అనన్య పాండే (Ananya Pandey 23 hours shooting)


బికిని షోకు కూడా ఏ మాత్రం తీసిపోకుండా అన్నీ చేస్తుంది అనన్య. సినిమా అంటే ప్రాణం ఇచ్చే ఈ బ్యూటీ ఇప్పుడు సంచలనం సృష్టించింది. సినిమా అంటే ప్రాణం కాబట్టి ఎంత పని చేయమన్నా తనకు అసలు అలుపు రాదే అంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం 'ఖాలీ పీలీ' సినిమాలో నటిస్తుంది ఈ భామ. ఈ సినిమా కోసం నాన్‌స్టాప్‌గా 23 గంటలు షూటింగ్‌ చేసింది అనన్య. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.

అనన్య పాండే (Ananya Pandey 23 hours shooting)
అనన్య పాండే (Ananya Pandey 23 hours shooting)
ఎలాంటి రెస్ట్ లేకుండా 23 గంటలు షూటింగ్ చేయడం అంటే మాటలు కాదు. కానీ అనన్య మాత్రం చేసింది. ఎందుకంటే సినిమా అంటే ఇష్టం అంటుంది అంతే. ఇలాంటి వర్క్ డెడికేషన్ ఉన్న హీరోయిన్స్ ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు అంటూ చిత్రయూనిట్‌తో పాటు దర్శక నిర్మాతలు కూడా అనన్యను నెత్తిన పెట్టుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగానే ఛాన్సులు కూడా ఇస్తున్నారు. కచ్చితంగా రాబోయే రెండేళ్లలో అనన్య పాండే స్టార్ హీరోయిన్ అవుతుందని అంచనా వేస్తున్నారు దర్శక నిర్మాతలు.
First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు