Alia Bhatt- Ranbir Kapoor: ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండటం అన్నది చాలా కష్టం. పరిస్థితులు, వృత్తి రీత్యా దూరంగా ఉన్నప్పటికీ సమయం కుదుర్చుకొని మరీ ప్రేమించే వారిని కలిసేందుకు ఇష్టపడుతుంటారు ఇప్పటి ప్రేమికులు. అయితే కరోనా రావడంతో ఇప్పుడు తన ప్రేమికుడికి దూరంగా ఉంటోంది ఈ బ్యూటీ. దీంతో తన భావాలను సోషల్ మీడియాలో తెలిపింది. ప్రియుడి చేతిలో తన చెయ్యి ఉన్న ఫొటోను షేర్ చేసి చాలా మిస్ అవుతున్నానంటూ కామెంట్ పెట్టింది ఆ నటి. ఇంతకు ఎవరా నటి అంటే.. అలియా భట్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో గత కొన్నేళ్లుగా అలియా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి, లాక్డౌన్ రాకపోయి ఉంటే ఈ పాటికే తామిద్దరి పెళ్లి జరిగి ఉండేదని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రణ్‌బీర్.
ఇదిలా ఉంటే ఇటీవల రణ్‌బీర్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ హీరో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు అలియా అతడికి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్‌ను బాగా మిస్ అవుతోన్న అలియా.. మేజర్ మిస్సింగ్ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది.
View this post on Instagram
మరోవైపు బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కూడా కరోనా సోకింది. ఇక భన్సాలీ దర్శకత్వంలో అలియా గంగూబాయ్ కథైవాడి చిత్రంలో నటిస్తుండటంతో.. ఆమె కూడా కరోనా టెస్ట్ చేయించుకుంది. అందులో అలియాకు నెగిటివ్‌గా తేలింది. దీంతో యథాప్రకారం షూటింగ్లో పాల్గొంటుంది అలియా. కాగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ ద్వారా అలియా భట్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజులుగా నటిస్తుండగా.. చెర్రీ సరసన అలియా కనిపిస్తుంది. అలాగే వీరు ముగ్గురు కలిసి ఉన్న సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Ranbir Kapoor