Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 23, 2019, 9:58 PM IST
ఆలియా భట్ (Photo: aliaabhatt/Instagram)
బాలీవుడ్ హీరోయిన్లకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. మన సినిమాలు వాళ్ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నా.. మనం వాళ్ల కంటే ఎదిగినా కూడా ఇప్పటికీ ఆ చిన్నచూపు కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలాంటి అహంకారమే చూపించింది. అలియా భట్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి వస్తుంది. ఈమె రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో రామ్ చరణ్ సరసన నటిస్తుంది అలియా భట్. అయితే ఈ చిత్ర షూటింగ్ విషయంలో అలియా భట్ డేట్స్ కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది.

రాజమౌళి,అలియా భట్
అయితే ప్రస్తుతం అలియాకు ఉన్న ఇమేజ్ కారణంగా RRR సినిమాకు బాలీవుడ్లో క్రేజ్ రావాలంటే ఎవరో ఒకరు ఉండాలి. రాజమౌళి బ్రాండ్ ఎలాగూ ఉన్నా కూడా దానికితోడు అలియా కూడా కలిస్తే మరో రేంజ్‌కు వెళ్లిపోతుంది. అయితే ఇప్పుడు RRR సినిమాలో తాను నటించడానికి కారణం కేవలం రాజమౌళి అంటూ చెప్పుకొచ్చింది ఈమె. ఇందులో ఎవరు నటిస్తున్నారు.. ఏ హీరోలున్నారు అనేది కూడా తనకు అనవసరం అని.. కేవలం కథ విన్న తర్వాత తన పాత్ర చూసుకుని.. రాజమౌళిపై ఉన్న గౌరవంతోనే తాను ఈ సినిమా చేస్తున్నానని క్లారిటీ ఇచ్చింది అలియా. ఈమె చెప్పిస సమాధానం ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది.

రామ్ చరణ్ అలియా భట్
మెగా పవర్ స్టార్ లాంటి హీరో సినిమాలో ఉన్నపుడు కనీసం గౌరవించడం తెలియదా.. ఆయనెవరో నీకు తెలియదా అలియా అంటూ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. బాహుబలి సినిమా చూసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని తాను కలలు కన్నానని.. ఇప్పుడు ఆ అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉందని చెప్పింది అలియా. అంతేకానీ హీరోలను చూసి.. వాళ్ల ఇమేజ్ చూసి ఈ సినిమా ఒప్పుకోలేదని ఇన్ డైరెక్టుగా చెప్పేసింది అలియా భట్. ఈమె సమాధానంతో ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉడికిపోతూ కౌంటర్లు వేస్తున్నారు.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 23, 2019, 9:56 PM IST