అలియా భట్‌కు అన్ని కోట్లు ఇస్తున్నారా.. ‘RRR’ కోసం ఆస్తులే..

Alia Bhatt: రాజమౌళి సినిమా కోసం అలియా భట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అలియా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 30, 2020, 7:04 PM IST
అలియా భట్‌కు అన్ని కోట్లు ఇస్తున్నారా.. ‘RRR’ కోసం ఆస్తులే..
ఆలియా భట్ (Alia Bhatt RRR remuneration)
  • Share this:
ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో కూడా ఇదే చర్చ హాట్ హాట్ గా జరుగుతుంది. రాజమౌళి సినిమా కోసం అలియా భట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అలియా.. అక్కడ దాదాపు 7 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో తెలుగు ఇండస్ట్రీకి ఆమె రావాలంటే అంత ఈజీ కాదు. రెమ్యూనరేషన్ విషయంలో తేడాలు వచ్చి చాలా రోజులుగా ఈ సినిమా ఒప్పుకోవాలా వద్దా అని సందిగ్ధంలో కూడా ఉందని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో తన సినిమాలో ఆలియా ఉందని రాజమౌళి కన్ఫర్మ్ చేశాడు.

ఆలియా భట్ (Alia Bhatt RRR remuneration)
ఆలియా భట్ (Alia Bhatt RRR remuneration)


మొన్నామధ్య కూడా తప్పుకుందనే ప్రచారం జరిగినా కూడా ఉందని మరోసారి కన్ఫర్మ్ చేసారు చిత్రయూనిట్. రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఏకంగా 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదేమంత ఎక్కువ కాదని అంతా అనుకుంటున్నారు.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమా కోసం ఆమె ఇచ్చిన డేట్స్ కేవలం 10 రోజులు మాత్రమే.. అంటే రోజుకు 50 లక్షల పారితోషికం అందుకుంటుంది అలియా.

ఆలియా భట్ (Alia Bhatt RRR remuneration)
ఆలియా భట్ (Alia Bhatt RRR remuneration)


బాలీవుడ్‌లో ఒక సినిమా కు 10 కోట్లు తీసుకునే ఆలియా భట్.. అక్కడి కంటే ఎక్కువే చార్జ్ చేస్తోంది. అక్కడ ఒక్కో సినిమా కోసం దాదాపు రెండు నెలలు కాల్షీట్స్ ఇస్తారు.. కానీ ఇక్కడ పది రోజులకే 5 కోట్లు తీసుకుంటుంది. ఈ విషయంలో నిర్మాత దానయ్యకు రాజమౌళి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పారితోషకం ఎక్కువైనా పర్లేదు కానీ బాలీవుడ్ మార్కెట్ మన సినిమాకు రావాలి అంటే ఆలియా భట్ ఉండాల్సిందేనంటూ జక్కన్న కోరడంతో నిర్మాత కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఆమె అడిగినంత ఇచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఆలియా భట్ (Alia Bhatt RRR remuneration)
ఆలియా భట్ (Alia Bhatt RRR remuneration)


రోజుకు 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు.. కానీ రాజమౌళి విజన్ నమ్మి దానయ్య కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆలియా భట్‌పై విమర్శలు ఎక్కువైపోయాయి. ఆమె ఉంటే కచ్చితంగా సినిమాను బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఆపేస్తామంటూ వార్నింగులు కూడా వస్తున్నాయి. కానీ అప్పటి వరకు మంట చల్లారుతుందని ఆశిస్తున్నాడు రాజమౌళి. అలియాతో పాటు అజయ్ దేవ్‌గన్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు. దాంతో బాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ రచ్చ చేస్తుందిప్పుడు.
First published: June 30, 2020, 7:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading