BOLLYWOOD ACTORS RANBIR KAPOOR ALIA BHATT TO GET ENGAGE TODAY IN JAIPUR HOTEL MNJ
Ranbir Kapoor- Alia Bhatt: ఇవాళ రణ్‌బీర్ కపూర్- అలియా భట్ ఎంగేజ్మెంట్..!
రణ్‌బీర్ కపూర్ అలియా భట్ ఎంగేజ్మెంట్
బాలీవుడ్లో మరో ప్రేమ జంట ఒక్కటి కాబోతున్నారా..? గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)- అలియా భట్(Alia Bhatt) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా..? అందులో భాగంగా ఇవాళ ఎంగేజ్మెంట్ జరగనుందా..?
Ranbir Kapoor- Alia Bhatt: బాలీవుడ్లో మరో ప్రేమ జంట ఒక్కటి కాబోతున్నారా..? గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న రణ్‌బీర్ కపూర్- అలియా భట్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా..? అందులో భాగంగా ఇవాళ ఎంగేజ్మెంట్ జరగనుందా..? అంటే అవుననే వార్తలే బలంగా వినిపిస్తున్నాయి. కరోనా రాకపోయి ఉంటే ఈపాటికి తమ పెళ్లి జరిగి ఉండేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన రణ్‌బీర్.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. జైపూర్‌లోని ఓ హోటల్లో ఇవాళ వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది.
అయితే మంగళవారం ఉదయం.. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నీతూ సింగ్‌లు జైపూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ వెంటనే రణ్వీర్ సింగ్, దీపిక పదుకొనే కూడా జైపూర్‌కి వెళ్లారు. వారి తరువాత బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా జైపూర్ పయనమయ్యాడు. వీరందరూ ఇప్పటికే ఓ హోటల్లో ఉండగా.. వారి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వీరంతా ఇప్పుడు ఒకే చోట ఎందుకు ఉన్నారో ఎవ్వరికీ ముందు అర్థం కాలేదు. కానీ కొత్త సంవత్సరం వస్తోన్న నేపథ్యంలో సెలబ్రేషన్స్ కోసం వీరంతా కలిసి ఉంటారని అందరూ భావించారు. అయితే ఈ లోపే మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఇవాళ రణ్‌బీర్- అలియా ఎంగేజ్మెంట్ జరగనుందని.. అందుకోసమే వారంతా అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అలియా తండ్రి మహేష్ భట్‌లతో పాటు రణ్‌బీర్ సోదరి రిద్దిమా కపూర్, అదార్ జైన్, కరణ్ జోహార్లు కూడా ఇవాళ అక్కడకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక అలియా-రణ్‌బీర్ ఎంగేజ్మెంట్ ఈ రాత్రి హోటల్లో జరగనుందని.. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని సమాచారం. ఇప్పటికైతే ఈ విషయం బయటకు చెప్పకపోయినప్పటికీ.. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఇదిలా ఉంటే అలియా భట్ ఈ మధ్యనే ఆర్ ఆర్ ఆర్ షూటంగ్‌లో పాల్గొంది. కానీ రామ్ చరణ్‌కి కరోనా రావడంతో.. ఆమె షూటింగ్‌కి మళ్లీ అంతరాయం ఏర్పడింది. దీంతో అలియా మళ్లీ ముంబయికి వెళ్లింది. కాగా రణ్‌బీర్ గతంలో దీపికాతో ప్రేమాయణం నడిపాడు. ఆ తరువాత కత్రినా కైఫ్‌తో ప్రేమలో పడ్డాడు. ఈ రెండు ప్రేమ కథలు విఫలయ్యాయి. ఇక ఇప్పుడు అలియాతో ప్రేమలో ఉన్నాడు. మరోవైపు గతంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న అలియా.. ఆ బ్రేకప్ తరువాత రణ్‌బీర్‌తో ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.