news18-telugu
Updated: May 22, 2019, 5:32 PM IST
వివేక్ ఒబెరాయ్ (ఫైల్)
దేశ వ్యాప్తంగా దాదాపు నెలన్నరకు పైగా ఏడు విడతల్లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారన్న విషయమై క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్.. ఈ ఎన్నికల్లో బీజేపీనే మళ్లీ అధికారంలోకి రాబోతుందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా ఒమంగ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం కౌంటింగ్ తర్వాతి రోజైన మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా వివేక్ మీడియాతో మాట్లాడారు.

పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ నుంచి మరో కొత్త పోస్టర్
రేపు మోదీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారు. ఆ నెక్ట్స్ డేనే మరోసారి మోదీ థియేటర్స్‌లోకి వస్తారు. దిల్లీ, ముంబాయిలో ఈ సినిమా ప్రీమియర్ షో ప్రదర్శిస్తే.. ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేయడం చూసి నాకెంతో ఆనందంగా ఉందన్నారు.అంతేకాదు ఈ సందర్భంగా ‘పీఎం నరేంద్ర మోదీ’కి సంబంధించిన మరో పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
First published:
May 22, 2019, 5:32 PM IST