సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ళ టైమ్ నడుస్తుంది. గతేడాది నుంచే మొదలయ్యాయి ఈ వివాహ వేడుకలు. 2020లో తెలుగు ఇండస్ట్రీలో రానా, నితిన్, నిఖిల్, కాజల్ సహా చాలా మంది పెళ్లి పీటలెక్కారు. 2021లో కూడా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మొన్నటికి మొన్న జనవరి 9న నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది సునీత. సింగర్ సునీత పెళ్ళిపై కొందరు విమర్శలు చేసినా కూడా చాలా మంది మాత్రం ఆమెను సపోర్ట్ చేసారు. ఇదిలా ఉంటే జనవరిలోనే మరో పెళ్లి కూడా జరగబోతుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరో 10 రోజుల్లో వివాహం చేసుకోబోతున్నాడు. ఈయన పెళ్లి జనవరి 24న జరగబోతుందని ప్రచారం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా నటాషా దలాల్‌తో డేటింగ్ చేస్తున్నాడు వరుణ్ ధావన్. నిజానికి ఈ ఇద్దరి పెళ్లి 2020లోనే అవుతుందని వార్తలొచ్చాయి. కాకపోతే లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు ఆ ముహూర్తం కుదిరింది. జనవరి 24న ముంబైలోని అలీబాగ్‌లో వరుణ్, నటాషా పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే దీనికోసం వరుణ్ తండ్రి, దర్శకుడు డేవిడ్ ధావన్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసాడు. ఇదిలా ఉంటే వరుణ్, నటాషా పెళ్ళికి చాలా తక్కువ మంది మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తుంది. కేవలం 40 నుంచి 50 మందికి మాత్రమే ఆహ్వానం అందుతుంది. అలీబాగ్‌లోని బీచ్‌కు ఎదురుగా ఉన్న రిసార్ట్ మొత్తాన్ని తన కొడుకు పెళ్లి కోసం బుక్ చేసుకున్నాడు డేవిడ్ ధావన్.

వరుణ్ ధావన్ నటాషా దలాల్ (Varun Dhawan Natasha Dalal)
ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ హాజరవుతున్నాడని తెలుస్తుంది. డేవిడ్ ధావన్‌కు ఈయన అత్యంత సన్నిహితుడు కావడమే దీనికి కారణం. ఆయనతో పాటు గోవిందా కూడా వస్తున్నాడని తెలుస్తుంది. 3 రోజుల పాటు వరుణ్ ధావన్ పెళ్లి ధూమ్ ధామ్‌గా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తైపోయాయి. వరుణ్ ధావన్ పెళ్లి కోసం దాదాపు 40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

వరుణ్ ధావన్ నటాషా దలాల్ (Varun Dhawan Natasha Dalal)
మరోవైపు పెళ్లికి ఆహ్వానం అందని బాలీవుడ్ సెలబ్రెటీల కోసం ముంబైలోని ఒక స్టార్ హోటల్లో భారీ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరికి ఈ పార్టీకి ఆహ్వానం అందినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:January 16, 2021, 17:11 IST