పేరు కోసం చేయలేదు.. న్యూస్ 18 ఇంటర్వ్యూలో సోనూ సూద్..

Sonu Sood: సోనూ సూద్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇన్ని రోజులు కేవలం నటుడిగానే తెలిసిన ఈయన ఇప్పుడు మానవత్వం ఉన్న మనిషిగా అందరికీ పరిచయం అయ్యాడు. తాజాగా ఈయన న్యూస్ 18తో మాట్లాడారు. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. ముఖ్యంగా ప్రస్తుతం ఈయన చేస్తున్న సేవ గురించి కూడా అందులో చెప్పుకొచ్చాడు. తాను ఇదంతా చేసింది కీర్తి కోసం కాదని చెప్పాడు సోనూ. ప్రశంసలు వస్తాయని చేయలేదని.. సమస్యలున్నపుడు సొంత వాళ్ల దగ్గర ఉండాలనుకుంటాం కదా.. అలాగే తాను కూడా వలస కార్మికులను ఇంటికి చేర్చడానికి సాయం చేసానని చెప్పుకొచ్చాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 29, 2020, 8:30 PM IST
పేరు కోసం చేయలేదు.. న్యూస్ 18 ఇంటర్వ్యూలో సోనూ సూద్..
సోనూ సూద్ (Twitter/Sonu Sood)
  • Share this:
న్యూస్ 18 ప్రతినిథి: చాలా మంది విరాళం అందించారు. కానీ మీరు మాత్రం కార్మికులను ఇంటికి పంపించే ప్రయత్నం చేసారు.. దీని గురించి మీ ఆలోచన శైలి ఏంటి..?

సోను సూద్: లాక్‌డౌన్ సమయంలో నేను కూర్చుని టీవీ చూస్తున్నాను. అందులో వలస కార్మికులు రహదారులపై మైళ్ళకు మైళ్ళు నడుస్తూ ఇళ్లకు చేరుకునే వార్తలను చూశాను. ఈ వలసదారులు రహదారులపై నడుస్తూ, ప్రాణాలను పణంగా పెట్టి, ఆకలితో, డబ్బు లేకుండా ఈ మొత్తం ప్రయాణంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నేను ఏసీ గదిలో కూర్చున్నప్పుడు.. అవన్నీ చూస్తూ నాకే ఏదోలా అనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను సాయం చేయాలని.

న్యూస్ 18 ప్రతినిథి: ఈ ఆలోచన వచ్చిన తర్వాత మీరేం చేసారు..?

సోను సూద్: థానే ప్రాంతంలోని దాహిశ్వర్‌లో చిక్కుకున్న వలస కార్మికులతో వెళ్లి మాట్లాడాను. వాళ్లను అక్కడ్నుంచి బయలుదేరవద్దని.. మళ్ళీ నడవడం మొదలుపెట్టొద్దని కోరాను. వాళ్లని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.. అలాగే నాకు 1-2 రోజుల సమయం అడిగాను. మీరు ఇంటికి తిరిగి వెళ్లడానికి నేను సహాయం చేస్తానని వాళ్లకు చెప్పాను. కార్మికుల పరిస్థితిని చూసి, వారి పిల్లల విచారకరమైన మొహాలు నన్ను బాధించాయి.

న్యూస్ 18 ప్రతినిథి: మీరు వారికి అర్థమయ్యేలా చెప్పారు.. కానీ వివిధ రాష్ట్రాలకు కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేయడం కష్టం కదా.. దానికి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి అవసరం.. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాలి. ఇవన్నీ మీరు ఎలా చేయగలిగారు..?

సోను సూద్: బాలీవుడ్ నటుడిగా ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి, ఇది మనందరికీ తెలుసు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత మొదట కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి పొందాను. 350 కర్ణాటక కార్మికులను ఇంటికి పంపించడం జరిగింది. ఇది నాకు విశ్వాసం ఇచ్చింది. అప్పుడు ముంబైలోని వివిధ ప్రాంతాల కార్మికులు నన్ను సంప్రదించడం ప్రారంభించారు. నేను వారిని ఇంటికి పంపించడం ప్రారంభించాను.

న్యూస్ 18 ప్రతినిథి: ఇదంతా మీకు కష్టంగా అనిపించలేదా..?సోను సూద్: కష్టం కంటే ఓపిక ఎక్కువ అని నేను చెప్తాను. కింది స్థాయి నుండి సీనియర్ ఆఫీసర్ల వరకు అందరితో మాట్లాడాను. వైద్య బృందానికి ఏర్పాట్లు చేశాను. కార్మికులకు ఆహారం అలాగే బస, వెళ్లేప్పపుడు ఆహారం వంటి చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. దేవుని ఆశీర్వాదంతో, నేను ఇప్పటివరకు 10,000 మంది కార్మికులను ఇంటికి పంపించగలిగాను. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఎప్పుడో ఓ సారి నేను నా నిగ్రహాన్ని కోల్పోతానని చాలాసార్లు అనుకున్నాను. అన్నీ ప్రశాంతంగా జరిపించడం అనేది కష్టమైన విషయమే.

న్యూస్ 18 ప్రతినిథి: మీరు ఏయే రాష్ట్రాల్లో బస్సులు పంపగలిగారు..?

సోను సూద్: కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్ కార్మికులను ఇంటికి పంపించాను.

న్యూస్ 18 ప్రతినిథి: కార్మికులు తిరిగివెళ్లడం గురించి మీరు రాష్ట్రాలతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, వారు అభ్యంతరం చెప్పలేదా..?

సోను సూద్: అవును ఇది నిజమే. కోవిడ్ -19 అనేది ప్రాణాంతక వ్యాధి. వాటిని కాస్త అర్థం చేసుకోవలసి వచ్చింది. మేము అన్ని రకాల వైద్య జాగ్రత్తలు తీసుకుంటున్నామని వాళ్లకు చూపించినప్పుడు వాళ్లు అంగీకరించారు. మేము ప్రస్తుతం తెలంగాణతో మాట్లాడుతున్నాము. వాళ్లు వలస కార్మికులను తిరిగి అనుమతించడం లేదు. కానీ నేను పట్టు వదలను. దీన్ని చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నేను అనుకుంటున్నాను. లేకపోతే ప్రతిదీ అంత సులభం కాదు.

న్యూస్ 18 ప్రతినిథి: ఒక్కోరోజు కార్మికుల సంఖ్య పెరుగుతుండటంతో అది కష్టంగా అనిపించడం లేదా..?

సోను సూద్: ఇది చాలెంజింగ్ వర్క్. ప్రతి రోజు వేలాది మంది కార్మికులు నన్ను సంప్రదిస్తున్నారు. చూద్దాం.. ఇంత పెద్ద బాధ్యత అవుతుందో మరి..

న్యూస్ 18 ప్రతినిథి: వీటన్నింటినీ మీరు ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు..?

సోను సూద్: ఈ పనిలో నా కుటుంబం మొత్తం నాతో చేరింది. ఎక్కడికి పంపాలి.. ఎవరికి ఏమి కావాలి లాంటి జాబితాను రూపొందించడం నా భార్య బాధ్యత. ఆహార సంబంధిత వస్తువులను మిక్కీ అనే నా స్నేహితుడు చూసుకుంటాడు. నా చార్టర్డ్ అకౌంటెంట్ పగలు రాత్రి పని చేస్తున్నాడు. మేము టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రారంభించాము. చాలామంది స్వయంగా ముందుకు వచ్చారు. కొందరు ఆహారాన్ని అందిస్తున్నారు, కొందరు మందులు అందిస్తున్నారు.. కొందరు బస్సులు అందిస్తున్నారు. చాలా మంది సాయం చేస్తూ మద్దతుగా ఉండటం వల్లే ఇది సాధ్యమవుతుంది. ఇదంతా సమిష్టి కృషి.

న్యూస్ 18 ప్రతినిథి: మీరు వైద్యులకు కూడా వసతి ఏర్పాటు చేశారు కదా..

సోను సూద్: అవును.. నాకు జుహులో ఒక హోటల్ ఉంది, అక్కడ నేను వైద్యులు ఉండటానికి ఏర్పాట్లు చేశాను. చాలా మంది వైద్యులు ఇంటికి చాలా దూరంగా నివసిస్తున్నారు. వారు ఆసుపత్రి నుంచి నా హోటల్‌కు వస్తారు. అక్కడే తింటారు.. హాస్పిటల్‌కు వెళ్లే ముందు కొంత విశ్రాంతి తీసుకుంటారు. వాళ్లే కదా ఇప్పుడు అసలు హీరోలు. నేను వాళ్ల కోసం నేను చేయగలిగినంత చేయటానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను.

న్యూస్ 18 ప్రతినిథి: మొత్తం దేశం మిమ్మల్ని ప్రశంసిస్తోంది.. మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?

సోను సూద్: నిజం చెప్పాలంటే ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ప్రజలను ఆశీర్వదించడమే నాకు అతిపెద్ద బహుమతి. కార్మికులు ఇంటికి చేరుకున్నప్పుడు.. వాళ్లు వాళ్ళ కుటుంబాలతో తిరిగి కలిసిన తర్వాత ఫోటోలను పంపుతున్నారు.. ప్రతిరోజూ నేను ఈ ఫోటోల కోసం వేచి ఉంటాను.

న్యూస్ 18 ప్రతినిథి: మీ విగ్రహం నిర్మిస్తున్నారు.. మీకు ఎలా అనిపిస్తుంది..?

సోను సూద్: నేనేం జాతీయ హీరోని కాదు. నా పేరు మీద విగ్రహానికి అర్హత లేదు. నన్ను అభిమానిస్తున్న వాళ్లకు ఆ డబ్బును ఏదో ఒక రకమైన సహాయం కోసం ఖర్చు చేయాలని నేను భావిస్తున్నాను, మాకు అది అవసరం. నాకు వాళ్ల ఆశీర్వాదం చాలు.

Byline- Arunima Dey​
First published: May 29, 2020, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading