Home /News /movies /

BOLLYWOOD ACTOR SAMMOHANAM FAME AMIT PUROHIT PASSED AWAY SUDHEER BABU INDRAGANTI MOHANA KRISHNA TRIBUTES TO HIS DEATH TA

‘సమ్మోహనం’ నటుడు అకాల మరణం.. విచారం వ్యక్తం చేసిన సుధీర్ బాబు..

‘సమ్మోహనం’ ఫేమ్ అమిత్ పురోహిత్ కన్నుమూత (ట్విట్టర్ ఫోటో)

‘సమ్మోహనం’ ఫేమ్ అమిత్ పురోహిత్ కన్నుమూత (ట్విట్టర్ ఫోటో)

సుధీర్ బాబు, అతిథి రావు హైదరీ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ బాయ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అమిత్ పురోహిత్ అనే నటుడు కన్నుమూశారు.

ఇంకా చదవండి ...
    సుధీర్ బాబు, అతిథి రావు హైదరీ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ బాయ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అమిత్ పురోహిత్ అనే నటుడు కన్నుమూశారు. ఈ విషయాన్ని సుధీర్ బాబు ట్విట్టర్ వేదికగా తెెలియ జేసి.. విచారం వక్త్యం చేసాడు. అంతేకాదు ప్రతి సన్నివేశానికి 100% న్యాయం చేసే అతి కొద్ది నటుల్లో ఆయన ఒకరు. మంచి భవిష్యత్తు ఉన్న నటుడు మనల్ని విడిచి వెళ్లిపోయారంటూ తన ఆవేదన వెలిబుచ్చాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు పోస్ట్ చేసాడు. ఇక అమిత్ మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అమిత్ హిందీ ‘పంక్’, ఆలాప్ వంటి కొన్ని హిందీ చిత్రాల్లో నటించాడు. మరోవైపు ‘సమ్మోహనం’ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ..అమిత్ అకాల మరణం పట్ట తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.






    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aditi Rao Hydari, Indraganti Mohana Krishna, Sudheer Babu, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు