హోమ్ /వార్తలు /సినిమా /

Aparichithudu remake: 16 సంవత్సరాల తరువాత హిందీలో రీమేక్ అవ్వనున్న అపరిచితుడు.. విక్రమ్ పాత్రలో స్టార్ హీరో

Aparichithudu remake: 16 సంవత్సరాల తరువాత హిందీలో రీమేక్ అవ్వనున్న అపరిచితుడు.. విక్రమ్ పాత్రలో స్టార్ హీరో

అపరిచితుడు రీమేక్

అపరిచితుడు రీమేక్

Aparichithudu remake: కోలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన చిత్రాల్లో గుర్తుండిపోయే మూవీల్లో అన్నియ‌న్(తెలుగులో అప‌రిచితుడు) ఒక‌టి. విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం అత‌డికి కూడా గుర్తుండిపోయే విజ‌యాన్ని ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో హీరోగా మ‌రో స్థాయికి వెళ్లాడు విక్ర‌మ్.

ఇంకా చదవండి ...

  Aparichithudu remake: కోలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన చిత్రాల్లో గుర్తుండిపోయే మూవీల్లో అన్నియ‌న్(తెలుగులో అప‌రిచితుడు) ఒక‌టి. విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం అత‌డికి కూడా గుర్తుండిపోయే విజ‌యాన్ని ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో హీరోగా మ‌రో స్థాయికి వెళ్లాడు విక్ర‌మ్. కాగా ఈ సినిమా వ‌చ్చి 16 ఏళ్లు అవుతుంది. 2005లో వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. కాగా ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్‌తో ఇండియ‌న్ 2ను తెర‌కెక్కిస్తోన్న శంక‌ర్.. ఆ త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌తో ఓ మూవీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ వ‌చ్చే ఏడాది సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. కాగా ఇటీవ‌ల బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్, శంక‌ర్‌ని క‌లిసిన విష‌యం తెలిసిందే.

  రోహిత్ శెట్టి తెర‌కెక్కిస్తోన్న స‌ర్క‌స్ మూవీకి కాస్త బ్రేక్ ఇచ్చిర ర‌ణ్‌వీర్ చెన్నైకి వ‌చ్చి మ‌రీ శంక‌ర్‌ని క‌లిశారు. అయితే రామ్ చ‌ర‌ణ్‌తో పాటు ఈ మూవీలో ర‌ణ్‌వీర్ క‌నిపించ‌నున్నాడ‌ని.. అందుకే అత‌డు వ‌చ్చి ర‌ణ్‌వీర్‌ని క‌లిశాడ‌ని టాక్ వ‌చ్చింది. కానీ తాజా స‌మాచారం ప్రకారం అప‌రిచితుడు రీమేక్ కోసం ర‌ణ్‌వీర్, శంక‌ర్‌ని క‌లిసిన‌ట్లు తెలుస్తోంది.

  ఈ నేప‌థ్యంలో ఈ సినిమా రీమేక్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌మ‌ని ర‌ణ్‌వీర్ శంక‌ర్‌ని కోరిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం దీనిపై శంక‌ర్ ఆలోచన‌లో ఉన్న‌ట్లు టాక్. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఇది క‌చ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. మ‌రి ఇందులో నిజ‌మెంత‌.. అప‌రిచితుడు రీమేక్‌కి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా.. లేక ఇంకెవ‌రికైనా బాధ్య‌తలు ఇస్తారా.. ర‌ణ్‌వీర్ సింగ్, విక్ర‌మ్ పాత్ర‌లో న‌టించ‌నున్నారా.. వంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఇండియ‌న్ 2 మూవీని ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా శంక‌ర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో క‌మ‌ల్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుండ‌గా.. సిద్ధార్థ్, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అనిరుధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Ranveer Singh, Shankar

  ఉత్తమ కథలు