నా కన్నా తోపు ఎవరు లేరు..పీఎం నరేంద్ర మోడీపై పరేష్ రావల్ సంచలన వ్యాఖ్యలు

పరేష్ రావల్, పీఎం నరేంద్ర మోడీ

బీజేపీ వీర విధేయుడు, పీఎం నరేంద్ర మోడీ వీర భక్తుడైన పరేష్ రావల్..భారత ప్రదాన మంత్రిపై సంచనల వ్యాఖ్యలు చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

 • Share this:
  బీజేపీ వీర విధేయుడు, పీఎం నరేంద్ర మోడీ వీర భక్తుడైన పరేష్ రావల్..భారత ప్రదాన మంత్రిపై సంచనల వ్యాఖ్యలు చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ పరేష్ రావల్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది ప్రధాని మోదీపై కాదు..ఆయన పాత్ర పోషిస్తోన్న వివేక్ ఓబరాయ్ పైనే.

  రీసెంట్‌గా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈసినిమాను దేశంలోని 23 పైగా భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ప్రదాని పాత్రలో వివేక్ ఓబరాయ్ నటిస్తూ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు.

  ‘పీఎం నరేంద్రమోదీ’ తెలుగు, హిందీ పోస్టర్స్


  తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌పై పరేష్ రావల్ స్పందించారు. ‘నేను ఇప్పటికీ చెబుతున్నా మోడీ పాత్రకు నేను తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు. నాకంటే ఎవరు బాగా నటించలేరంటూ ఛాలెంజ్ విసిరాడు కూడా.

  వివేక్ ఓబెరాయ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్
  వివేక్ ఓబెరాయ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్


  ఏది ఏమైనా ఇది ప్రజాస్వామ్య దేశం అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ ఒక నిట్టూర్పు విడిచాడు.పైగా పీఎం మోడీ పాత్రలో నటిస్తోన్న వివేక్ ఓబరాయ్‌కు అభినందలు తెలియచేసాడు.

  PM Narendra Modi Poster: Vivek Oberoi is Unrecognisable in This Biopic
  ‘పీఎం నరేంద్రమోదీ’గా వివేక్ ఓబెరాయ్


  ఎన్నాళ్లుగానే పరేష్ రావల్ ..ప్రధాని మోడీపై ఒక సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాడు. పైగా ఆయన బీజేపీ ఎంపీ కూడా. అందరు కూడా పరేష్ రావల్ ముఖ్యపాత్రలో నరేంద్ర మోడీ బయోపిక్ తెరకెక్కుతుందని అనుకున్నారు. లాస్ట్ ఇయర్ జూన్‌లో మోడీపై బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించాడు కూడా. ఇప్పటి వరకు ఈ బయోపిక్‌పై ముందడుగు పడలేదు.  త్వరలో మా దగ్గరనుంచి కూడా ఈ బయోపిక్ రావచ్చేమో పరేష్ రావల్ ప్రకటించడం  కొసమెరుపు. చూస్తుంటే పీఎం నరేంద్ర మోడీపై బాలీవుడ్‌లో ఒకటికి రెండు బయోపిక్‌లు వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.

   ఈషా రెబ్బా హాట్ ఫోటోస్  ఇవి కూడా చదవండి 

  తెలుగులో వస్తోన్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’

  త్రివిక్రమ్‌తో వన్స్‌మోర్: నువ్వు నాకు నచ్చావ్ అంటున్న వెంకటేష్

  అక్కడ ముందు కొర‌టాల శివ‌.. ఆ త‌ర్వాతే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్..

   
  First published: