• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD ACTOR KANGANA RANAUT TESTS CORONA POSITIVE SR

Kangana Ranaut tests corona positive : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్..

Kangana Ranaut tests corona positive : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్..

Kangana Ranaut in Thalaivi Photo : Twitter

Kangana Ranaut : హిందీ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. కంగనా ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. అది అలా ఉంటే ఆమెకు కరోనా సోకిందని తెలుస్తోంది.

  • Share this:
    Kangana Ranaut : హిందీ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. కంగనా ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. అది అలా ఉంటే ఆమెకు కరోనా సోకిందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కంగనా  తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన 'ఏక్ నిరంజన్‌' సినిమాలో ప్రియురాలు 'సమీర'గా ఇరగదీసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ టాక్‌ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. అంతేకాదు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య ప్రకటించిన 67th జాతీయ అవార్డుల్లో కంగనాకు పంగా, మణికర్ణిక సినిమాల్లో తన నటనకు బెస్ట్ యాక్టర్‌గా జాతీయ పురస్కారం లభించింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. కంగనా రనౌత్.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'తలైవి' సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది.

    ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ అండ్ టీజర్‌లు విడుదలయ్యాయి. అంతేకాదు మంచి ఆదరణ పొందాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాను ఎ ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.


    అయితే ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారంఈ నెల 23న తమిళం, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా.. సినిమా విడుదలను వాయిదా వేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటికే రోజురోజుకు కేసులు ఎక్కువవుతుండడంతో.. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ చిత్రాన్ని విడుదల చేయడం లేదనీ, వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు విష్ణువర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ సహా జీ స్టూడియోస్‌ ఓ ప్రకటనలో తెలిపాయి. ఇక కంగనా ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈ సినిమాతో పాటు కంగనా హిందీలో ‘తేజస్’, ’ధాకడ్’ అనే మరో రెండు సినిమాలను చేస్తోంది. ఇక కంగనా తాజాగా బెంగాల్ హింస విషయంలో కొన్ని ట్విట్స్ చేసింది. ఆ ట్వీట్స్ ట్విట్టర్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన ట్విట్టర్ టీమ్ ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా బ్యాన్ చేసింది. గతంలో కూడా కంగనా పలు మార్లు వివాదస్పద ట్వీట్స్ చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ఈ చర్యను తీసుకుంటున్నట్లు తెలిపింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు