హోమ్ /వార్తలు /సినిమా /

ఆస్పత్రిలో చేరిన హేమ మాలిని భర్త ధర్మేంద్ర.. ఏం జరిగిందంటే?

ఆస్పత్రిలో చేరిన హేమ మాలిని భర్త ధర్మేంద్ర.. ఏం జరిగిందంటే?

ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర

ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర

బాలీవుడ్ హిట్ పెయిర్‌లో ఒకటి ధర్మేంద్ర హేమామాలిని. షోలే సినిమాలతో ఈ జంట అందర్నీ ఆకట్టుకుంది. నిజజీవితంలో కూడా వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనను చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన నాలుగు రోజుల క్రితమే.. ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర అనారోగ్యానికి కారణాలు ఏంటో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. మరోవైపు, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని..ఎలాంటి ప్రమాదం లేదని కొందరంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన ధర్మేంద్రని చికిత్స నిమిత్తం డాక్టర్లు ఐసీయూలో ఉంచారట. కానీ, తాజా పరిస్థితుల్లో ఆయన్ని ఐసీయూ మరో వార్డుకి తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ధర్మేంద్ర వెన్నులో వెన్నులో కండరాలు పట్టేయడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ షూటింగ్‌లో ఉన్న ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడని ప్రస్తుతం కోలుకుంటున్నానని ధర్మేంద్ర స్వయంగా తెలిపారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన తన అభిమానులు, ఫాలోవర్స్‌ అనుచరుల “ఆశీర్వాదాలతో” ఇంటికి తిరిగి వచ్చానని తెలిపారు. వీడియోలో ధర్మేంద్ర "వెనుక భాగంలో పెద్ద కండరాలు లాగినట్లు" అతను ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించాడు. "కాబట్టి, చింతించకండి. నేను ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాను," అని ఆయన పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులను కోరారు.

ఈ సంవత్సరం ప్రారంభం జనవరిలో ధర్మేంద్ర తనకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల ముందు జాగ్రత్త మోతాదు తీసుకోవడం కనిపించింది. "స్నేహితులారా, వినయపూర్వకమైన అభ్యర్థన, దయచేసి బూస్టర్ డోస్ తీసుకోండి" అని పోస్టు చేశారు. దీనిపై చాలామంది అభిమానులు స్పందించారు. ఆయన కూతురు ఈషా డియోల్ సైతం "లవ్ యు పాపా" అని కామెంట్ చేశారు.

ధర్మేంద్ర ప్రస్తుతం కరణ్ జోహర్ నిర్మాణంలో ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమాలో నటిస్తున్నాడు. ‘షోలే’ తరువాత ఇన్ని దశాబ్దాల అనంతరం జయా బచ్చన్ తో కలసి ఆయన మళ్లీ తెరపై కనిపించబోతున్నాడు. ‘రాకీ ఔర్ రాణీ...’లో షబానా అజ్మీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కాగా కరణ్ జోహర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో రణవీర్ సింగ్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా అలరించనున్నారు. ఇక కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తో పాటూ మనవడు కరణ్ డియోల్ తో కలసి ‘అప్నే’ సినిమాకు సీక్వెల్ లో కూడా ధర్మేంద్ర కనిపించబోతున్నాడు.

First published:

Tags: Bollywood, Hema Malini, Sunny Deol

ఉత్తమ కథలు