Nani : నాని సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్...

నాని, సాయి పల్లవి Photo : Twitter

Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే సినిమా చేస్తున్నాడు.

  • Share this:
    నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్దమవుతోంది. ఎప్పుడో ఉగాదికి విడుదలకావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇన్ని రోజుల తర్వాత ఇపుడు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో విడుదలకానుంది. ఈ సినిమాలో నానితో పాటు మరో ప్రధాన పాత్రలో సుధీర్ బాబు నటించారు. నివేదా థామస్, అదితి రావు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అది అలా ఉంటే నాని వి సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నాడు. టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేస్తున్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్’గా వస్తోన్న ఈ సినిమా గురించి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అది కూడా విలన్ పాత్ర కోసం. ‘శ్యామ్ సింగ రాయ్’లో ఓ అదిరిపోయే నెగిటివ్ రోల్ ఉందట. ఆ పాత్ర కోపం హిందీ నటి అదితి రావు హైదరి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె క్యారెక్టరైజేషన్ వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తోంది.

    Actress aditi rao hydari clarifies on doing maniratnam new movie ak aditi rao hydari,aditi rao hydari interview,aditi rao hydari songs,aditi rao hydari movies,aditi rao,aditi rao hydari dance,aditi rao hydari lifestyle,aditi rao hydari movie,aditi rao hydari family,aditi rao hydari singing,aditi rao singing,aditi rao hydari workout,aditi rao hydari spotted,aditi rao hydari husband,aditi rao hydari',aditi rao hydari rampwalk,aditi rao hydari ad
    అదితి రావు హైదరి Twitter


    ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఉండటంతో టాలెంటెడ్ యాక్టర్ సాయి పల్లవిని తీసుకోనున్నారు. ఇక ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: