బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలోని ఈయన బంగ్లాలోని కొంత భాగాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) కౌన్సిలర్, కాంగ్రెస్ నేత తులిప్ బ్రియాన్ మిరండా డిమాండ్ చేశారు. ఈ బంగ్లా పేరు ప్రతీక్ష.. ఇందులో కొంతభాగం అక్రమంగా అమితాబ్ లాక్కున్నాడని.. దాన్ని వెంటనే బిఎంసీ స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఇందులో అక్రమ నిర్మాణాలు జరిగాయంటే నాలుగేళ్ళ కింద అమితాబ్ బచ్చన్‌కు నోటీసులు పంపించారు బిఎంసీ అధికారులు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ తులిప్ బ్రియాన్ ఆరా తీసారు. ఈ నోటీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్మించుకున్న మొదటి బంగ్లా పేరు ప్రతీక్ష. ఆ తర్వాత ఈయన జల్సా అనే మరో బంగ్లాను కూడా నిర్మించుకున్నాడు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ప్రతీక్షలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు 2017లో బీఎంసీ నోటీసులు ఇచ్చింది.
దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తులిప్ బ్రియాన్ మిరండా ఆరోపించారు. అమితాబ్ బచ్చన్‌కు బీఎంసీ 2017లో నోటీసు ఇచ్చిందని.. రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ఈ నోటీసును ఇచ్చిందని తెలిపారు ఈయన. కానీ ఇప్పటి వరకు కూడా బిఎంసీ దీనిపై ఉదాసీనంగానే వ్యవహరించిందని సీరియస్ అయ్యారు ఈమె.
నోటీసు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని తులిప్ ప్రశ్నించారు. ఓ సామాన్యుడి భూమి అయితే ఈ పాటికే బీఎంసీ స్వాధీనం చేసుకుని ఉండేదని.. కానీ అమితాబ్ కాబట్టి ఆగిపోయారంటూ దుయ్యబట్టారు. మున్సిపల్ చట్టం ప్రకారం భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు. మరి ఈ వివాదంపై అమితాబ్ బచ్చన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Hindi Cinema