ప్రభాస్ ‘సాహో’ షూటింగ్ స్పాట్‌కు బీజేపీ కీలక నేత

షూటింగ్ స్పాట్‌లో బీజేపీ జాతీయ నేత ఒకరు తళుక్కుమనడం చర్చనీయాంశంగా మారింది. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రభాస్ పాపులర్ అయ్యారని... అందుకే అటు వైపు వచ్చిన బీజేపీ నేత షూటింగ్ స్పాట్‌కు వచ్చి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.

news18-telugu
Updated: April 27, 2019, 10:15 AM IST
ప్రభాస్ ‘సాహో’ షూటింగ్ స్పాట్‌కు బీజేపీ కీలక నేత
సాహో సెట్‌తో ప్రభాస్‌ను కలిసిన నితిన్ గడ్కరీ
  • Share this:
టాలీవుడ్ క్రేజీ హీరో ప్రభాస్ సాహో సినిమా కోసం తెలుగు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా... అక్కడే షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టబోతున్నట్టు తెలుస్తోంది. చిత్ర హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటోంది. ముంబైలోని కర్జాత్ స్టూడియోలో సాహో మూవీ లాస్ట్ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేసినట్టు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ సంగతి విశేషాలు ఎలా ఉన్నా... ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో బీజేపీ జాతీయ నేత ఒకరు తళుక్కుమనడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ముఖ్యనేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ చిత్ర షూటింగ్ స్పాట్‌ను సందర్శించారు. చిత్ర యూనిట్‌తో కలిసి ఆయన దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రభాస్ పాపులర్ అయ్యారని... అందుకే అటు వైపు వచ్చిన నితిన్ గడ్కరీ షూటింగ్ స్పాట్‌కు వచ్చి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రభాస్ పెదనాన్న, టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు బీజేపీ నాయకుడు కాబట్టే... నితిన్ గడ్కరీ ఇలా సాహో సెట్‌కు వచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది.
First published: April 27, 2019, 8:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading