Amazon- Tandav: శివుడినే హేళన చేస్తారా..? హిందువులంతా అమెజాన్ ను బహిష్కరించండి.. బీజేపీ ఎమ్మెల్యే పిలుపు

తాండవ్ సీరీస్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే

ఈ సినిమాపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో పోలీసులు కూడా ఓ కేసును నమోదు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రతిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా అడ్వైజర్ షలభ్ మణీ త్రిపాటి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ప్రజల మనోభావాలతో వ్యాపారం చేసుకుంటున్న వారిని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉపేక్షించబోదు. తాండవ్ సీరీస్ లో నటించిన ప్రతీ ఒక్క నటుడిపై కేసు నమోదయింది. అరెస్టు కావడానికి సిద్ధంగా ఉండండి‘ అని ఆయన కామెంట్ చేశారు.

  • Share this:
    మహారాష్ట్రలోని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం అమెజాన్ పై ఫైర్ అయ్యారు. అమెజాన్ ను హిందువులంతా బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలతో అమెజాన్ వ్యాపారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 15న అమెజాన్ ప్రైమ్ లో సైఫ్ అలీ ఖాన్ నటించిన ’తాండవ్‘ వెబ్ సీరీస్ విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సీరీస్ లో హిందూ దేవుళ్లను హేళన చేసేలా, అవమానించేలా సన్నివేశాలను రూపొందించారని ఆ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఆ వెబ్ సీరీస్ ను వెంటనే అమెజాన్ ప్రైమ్ నుంచి తీసేయాలనీ, హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

    వాస్తవానికి ఈ వెబ్ సీరీస్ విషయమై రామ్ కదం ముందుగా పోలీస్ కేసు పెట్టారు. దాన్ని యాప్ లోంచి డిలీట్ చేయించాల్సిందిగా కోరారు. అదే సమయంలో హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పించాలన్నారు. తాండవ్ సీరీస్ పై కేసు పెట్టినా ఆసినిమా మేకర్స్ కానీ, అమెజాన్ కానీ స్పందించకపోవడంతో మరుసటి రోజు ఆయన తన వ్యాఖ్యలకు పదును పెట్టారు. ’హిందువుల దైవం శివుడిని హేళన చేస్తున్న అమెజాన్ ప్రైమ్ ను హిందువులంతా బహిష్కరించాలి. అమెజాన్ ద్వారా ఉత్పత్తులను కొనొద్దు. అమెజాన్ కు సంబంధించిన బ్రాండ్లను బహిష్కరించండి‘ అని రామ్ కదం ప్రజలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ కు లేఖ రాశారు. ఈ సినిమా విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

    కాగా, ఈ సినిమాపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో పోలీసులు కూడా ఓ కేసును నమోదు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రతిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా అడ్వైజర్ షలభ్ మణీ త్రిపాటి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ప్రజల మనోభావాలతో వ్యాపారం చేసుకుంటున్న వారిని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉపేక్షించబోదు. తాండవ్ సీరీస్ లో నటించిన ప్రతీ ఒక్క నటుడిపై కేసు నమోదయింది. అరెస్టు కావడానికి సిద్ధంగా ఉండండి‘ అని ఆయన కామెంట్ చేశారు.
    Published by:Hasaan Kandula
    First published: